Crime: ప్రాణ స్నేహితుడని ఇంట్లోకి రానిస్తే, అతడి భార్యను బ్లాక్ మెయిల్ చేసి బెడ్రూంలో దూరి ఆ కోరికలు తీర్చుకుంటూ..దారుణం..

ఈ క్రమంలో స్నేహితుడి భార్యపై ప్రశాంత్‌ కన్ను పడింది. ఆమెతో తరచూ మాట్లాడుతూ ఉండేవాడు. కాగా ఆమె భర్త పని మీద బయట ప్రాంతాలకు వెళుతుండేవాడు. దీంతో ఇదే అదనుగా భావించిన ప్రశాంత్, ఆమెను తన ట్రాప్ లో పడేశాడు.

Image Used for Representational Purpose Only | (Photo Credits: File Image)

మానవ సంబంధాలు నానాటికి దిగజారిపోతున్నాయి. స్నేహితుడని నమ్మి ఇంట్లోకి రానిస్తే, అతడి భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకోవడమే కాదు ఆమెను బ్లాక్ మెయిల్ చేసి లక్షలు దోపిడీ చేశాడో ప్రబుద్ధుడు. ఈ దారుణ ఘటన హైదరాబాద్ లోని జీడిమెట్ల పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే...గాజులరామారంలోని నెహ్రూనగర్‌కు చెందిన ప్రశాంత్‌ జీడిమెట్ల భాగ్యలక్ష్మీకాలనీలో ఉంటున్న తన స్నేహితుడి ఇంటికి తరచూ వెళ్తుండేవాడు. ఈ క్రమంలో స్నేహితుడి భార్యపై ప్రశాంత్‌ కన్ను పడింది. ఆమెతో తరచూ మాట్లాడుతూ ఉండేవాడు. కాగా ఆమె భర్త పని మీద బయట ప్రాంతాలకు వెళుతుండేవాడు. దీంతో ఇదే అదనుగా భావించిన ప్రశాంత్, ఆమెను తన ట్రాప్ లో పడేశాడు. దీంతో వారిద్దరి బంధం శారీరక బంధంగా మారిపోయింది. కాగా తన భర్తకు ఈ బంధం గురించి తెలిస్తే ప్రమాదమని భావించిన బాధితురాలు, ఇకపై వద్దని ప్రశాంత్ తో వారించింది. దీంతో అతడు రివర్స్ అయ్యాడు. ఆమెను ప్రేమిస్తున్నానని అంగీకరించకపోతే చచ్చిపోతానని, లేదంటే చంపేస్తానని బెదిరించి ఆమెను లైంగికంగా వశబరుచుకునేవాడు. విషయాన్ని ఎక్కడైనా చెబితే తన వద్ద వీడియోలున్నాయని, వాటిని సోషల్ మీడియాలో పెట్టి అందరికీ పంపుతానని బెదిరిస్తూ పలుసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.

అంతటితో ఆగలేదు. ఇటీవల స్థలం విక్రయం సందర్భంగా వచ్చిన సొమ్ముపై ప్రశాంత్ కన్నుపడింది. ఆమె వద్ద ఉన్న రూ.16 లక్షలు తీసుకుని బెదిరింపులకు పాల్పడుతున్నాడు. చివరకు బాధితురాలు ఈ వేధింపులు భరంచలేక తన భర్తకు తెలియజేయగా, ఇరువురు కలిసి పేట్‌బషీరాబాద్‌ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకునన్న పోలీసులు ప్రశాంత్‌ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement