
Hyderabad, Mar 7: హైదరాబాద్ లోని (Drunken Women Hulchul At KPHB) కూకట్ పల్లి హౌజింగ్ బోర్డ్ (కేపీహెచ్ బీ) ముగ్గురు యువతులు హల్ చల్ చేశారు. మద్యంమత్తులో కారు (Car) నడుపుతూ బీభత్సం సృష్టించారు. కేబీహెచ్ బీ మెట్రో స్టేషన్ వద్ద ఓ బైకును ఢీకొట్టిన ముగ్గురు యువతులు.. ఆపై అతనితో గొడవకు దిగారు. బైకర్ ను బెదిరించడంతో పాటు అతనిపై ఒకింత దాడికి యత్నించారు. దీంతో భయపడిపోయిన అతడు సమీపంలోని ట్రాఫిక్ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో పోలీసులు కారులోని యువతుల్లో ముఖ్యంగా కారు నడుపుతున్న యువతికి బ్రీత్ అనలైజర్ తో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టు చేశారు.
మద్యం మత్తులో యువతుల హల్చల్..
హైదరాబాద్ KPHB మెట్రో స్టేషన్ వద్ద మద్యం సేవించి కారుతో ద్విచక్ర వాహనాలను ఢీకొట్టిన కారు
వాహనాలను ఢీ కొట్టడమే కాకుండా బైక్ నడుపుతున్న యువకులను బెదిరించిన ముగ్గురు యువతులు
యువతులకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయగా రీడింగ్ లో 212 పాయింట్లు నమోదైనట్లు… pic.twitter.com/OI9owCs7Xu
— BIG TV Breaking News (@bigtvtelugu) March 7, 2025
టెస్టులో 212 పాయింట్లు
టెస్టులో 212 పాయింట్లు నమోదయింది. దీంతో సదరు తువతి ఫూటుగా మద్యం తాగినట్లు నిర్ధారించారు. కారులో డ్రైవింగ్ చేస్తున్న యువతితోపాటు మరికొందరు ఉన్నారు. వారంతా కూడా ఫుల్లుగా మద్యం సేవించినట్లు తెలిపారు. కారులో బీర్ క్యాన్లను గుర్తించామన్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.