Tirumala Brahmotsavalu: శ్రీవారి బ్రహ్మోత్సవాల తేదీలు ఖరారు.. సెప్టెంబరు 18 నుంచి 26 వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబరు 15 నుంచి 23 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల తేదీలు ఖరారయ్యారు. ఈ ఏడాది అధికమాసం కారణంగా రెండు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. సెప్టెంబరు 18 నుంచి 26 వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబరు 15 నుంచి 23 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్టు టీటీడీ ప్రకటించింది.

Credits: Twitter

Tirumala, Aug 22: తిరుమల (Tirumala) శ్రీవారి బ్రహ్మోత్సవాల (Srivari Brahmotsavalu) తేదీలు ఖరారయ్యారు. ఈ ఏడాది అధికమాసం కారణంగా రెండు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. సెప్టెంబరు 18 నుంచి 26 వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబరు 15 నుంచి 23 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్టు టీటీడీ ప్రకటించింది. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో సెప్టెంబర్‌ 18 నుంచి అక్టోబర్‌ 2 వరకు, అక్టోబర్‌ 15 నుంచి 23 వరకు, అక్టోబర్‌ 14న నిర్వహించాల్సిన పలు సేవలు రద్దు చేయనున్నట్టు తెలిపింది.

రద్దు చేసే సేవలివి..

బ్రహ్మోత్సవాల నేపథ్యంలో సెప్టెంబర్‌ 18 నుంచి అక్టోబర్‌ 2 వరకు, అక్టోబర్‌ 15 నుంచి 23 వరకు అష్టాదశ పాదపద్మారాధన, తిరుప్పావడై, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, సహస్రదీపాలంకార సేవలు రద్దు చేయనున్నారు. ముందస్తుగా ఆర్జిత బ్రహ్మోత్సవం సేవా టికెట్లు బుక్‌ చేసుకున్న భక్తులను నిర్దేశిత వాహన సేవకే అనుమతిస్తారు. నవరాత్రి బ్రహ్మోత్సవాల అంకురార్పణ కారణంగా అక్టోబర్‌ 14న సహస్రదీపాలంకార సేవను రద్దు చేసినట్టు టీటీడీ ప్రకటించింది.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Tirumala Brahmotsavalu: నేటి నుంచి తిరుమల బ్రహ్మోత్సవాలు... రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం చంద్రబాబు.. ప్రైవేటు వాహనాలపై ఆంక్షలు

Tirumala: శ్రీవారి భక్తులకు శుభవార్త.. తిరుమలలో భారీగా తగ్గిన రద్దీ.. వెయిటింగ్ లేకుండా నేరుగా శ్రీవారి సర్వదర్శనం.. కేవలం గంట వ్యవధిలోనే దర్శనం

Tirumala Brahmotsavalu: శ్రీవారి బ్రహ్మోత్సవాల తేదీలు ఖరారు.. సెప్టెంబరు 18 నుంచి 26 వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబరు 15 నుంచి 23 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు

TTD: తిరుమల భక్తులకు ముఖ్య గమనిక.. బ్రహ్మోత్సవాల వేళ 12 వేల వాహనాలకే అనుమతి.. కరోనా కారణంగా రెండేండ్ల నుంచి నిలిచిపోయిన బ్రహ్మోత్సవాలు.. ఇప్పుడే తిరిగి ప్రారంభం..

Advertisement
Advertisement
Share Now
Advertisement