Uttarakhand: కోర్టులో వాదించడానికి వచ్చిందేమో, గేట్లను విరగొడుతూ కోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన అడవి ఏనుగు, వీడియో ఇదిగో

ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌ రోషనాబాద్‌లోని జిల్లా సెషన్స్ కోర్టులోకి ప్రవేశించిన అడవి ఏనుగు అలజడి సృష్టించింది. గేటును ఢీకొట్టి కోర్టు ప్రాంగణంలోకి ఏనుగు రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

Uttarakhand: కోర్టులో వాదించడానికి వచ్చిందేమో, గేట్లను విరగొడుతూ కోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన అడవి ఏనుగు, వీడియో ఇదిగో
Wild Elephant Breaks Through Court’s Gate in Haridwar

ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌ రోషనాబాద్‌లోని జిల్లా సెషన్స్ కోర్టులోకి ప్రవేశించిన అడవి ఏనుగు అలజడి సృష్టించింది. గేటును ఢీకొట్టి కోర్టు ప్రాంగణంలోకి ఏనుగు రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. రాజాజీ టైగర్ రిజర్వ్ నుండి బయటికి వచ్చిన అడవి ఏనుగు.. జిల్లా మేజిస్ట్రేట్ కార్యాలయంలోకి చొరబడింది. కోర్టు ఆవరణలో తిరుగుతూ గందరగోళం సృష్టించింది. కోర్టు గేట్లను తోసేసి గోడను కూడా ధ్వంసం చేసిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఏనుగు కోర్టు ప్రాంగణంలోకి ప్రవేశించే ముందు కోర్టు ప్రధాన గేటును అమాంతం పక్కకు తోసేసిన దృశ్యాలు వీడియోలో కనిపిస్తున్నాయి. అటవీ అధికారులకు సమాచారం అందించడంతో అప్రమత్తమయ్యారు. ఘటనా స్థలానికి వచ్చి ఆ ఏనుగును అడవిలోకి తరలించారు.

Here's Video

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Dec 28, 2023 04:32 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).