Samantha Weinstein Dies: సినీ పరిశ్రమలో మరో తీవ్ర విషాదం, చిన్న వయసులోనే అండాశయ క్యాన్సర్‌తో ప్రముఖ హాలీవుడ్‌ నటి సమంతా వైన్‌స్టెయిన్ మృతి

చిత్ర పరిశ్రమను విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. తాజాగా హాలీవుడ్‌ నటి సమంతా వైన్‌స్టెయిన్ (28) చిన్నవయసులోనే కన్నుమూసింది. రెండున్నరేళ్లుగా అండాశయ క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆమె ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచింది. మే 14న ఆమె మరణించగా ఆలస్యంగా విషయం వెలుగులోకి వచ్చింది.

Samantha-Weinstein (Image: Instagram/samsationalw)

చిత్ర పరిశ్రమను విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. తాజాగా హాలీవుడ్‌ నటి సమంతా వైన్‌స్టెయిన్ (28) చిన్నవయసులోనే కన్నుమూసింది. రెండున్నరేళ్లుగా అండాశయ క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆమె ఆస్పత్రిలో మే 14న మరణించగా ఆలస్యంగా విషయం వెలుగులోకి వచ్చింది. నటి మరణంపై హాలీవుడ్‌ సెలబ్రిటీలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.సమంత మా అందరి జీవితాలను మార్చివేసిందంటూ ఆమె తల్లి భావోద్వేగానికి లోనైంది.

10 ఏళ్లకే నటనను కెరీర్‌గా ఎంచుకున్న సమంత. 2005లో బిగ్‌ గర్ల్‌లో జోసెఫిన్‌ పాత్రను పోషించింది. పలు చిత్రాల్లో నటించి మెప్పించిన సమంత 2022 అక్టోబర్‌లో మైఖేల్‌ నుట్సన్‌ను పెళ్లాడింది. మే 1న అతడితో కలిసి హనీమూన్‌కు వెళ్లిన ఫోటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. ఇందులో నటి తన భర్తతో కలిసి చిరునవ్వులు చిందించింది. అయితే అదే ఆమె ఆఖరి పోస్టు కావడం గమనార్హం.

News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement