Salman Khan Dance Video: సల్మాన్ ఖాన్ డ్యాన్స్ వీడియో ఇదిగో, వినాయక చవితి వేడుకల్లో చిన్నపిల్లలతో కలిసి చిందేసిన బాలీవుడ్ హీరో
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ముంబయిలో సందడి చేశారు. వినాయక చవితి వేడుకల్లో పాల్గొన్న ఆయన డ్యాన్స్ చేస్తూ కనిపించారు. చిన్నపిల్లలతో కలిసి డప్పుల ముందు చిందులు వేశారు. దీనికి సంబంధించిన వీడియోను సల్మాన్ తన ట్విటర్‌లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ప్రస్తుతం సల్మాన్ ఖాన్ సికిందర్ చిత్రంలో నటిస్తున్నారు. సల్మాన్ చివరిగా 'టైగర్ 3'లో కత్రినా కైఫ్ సరసన నటించారు. ఈ మూవీ వచ్చే ఏడాది థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రానికి ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో సల్మాన్ సరసన రష్మిక మందన్నా స్క్రీన్ పంచుకోనుంది
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)