Kanna Kanna Video Song: మేజర్ నుంచి కొత్తగా ఎమోషనల్‌ వీడియో సాంగ్‌, కన్నా కన్నా అంటూ సాగిన సాంగ్, నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోన్న లేటెస్ట్ సాంగ్

అడివిశేష్ హీరోగా శ‌శికిర‌ణ్ టిక్కా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన లేటెస్ట్‌ చిత్రం ‘మేజ‌ర్‌’. ముంబై బాంబు దాడుల్లో అమ‌ర వీరుడైన మేజ‌ర్ సందీప్ ఉన్నికృష్ణ‌న్ జీవిత క‌థ ఆధారంగా రూపొందిన ఈ చిత్రం జూన్ 3న విడుద‌లై సంచ‌ల‌న విజ‌యం సాధించింది.

Kanna kanna video song

అడివిశేష్ హీరోగా శ‌శికిర‌ణ్ టిక్కా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన లేటెస్ట్‌ చిత్రం ‘మేజ‌ర్‌’. ముంబై బాంబు దాడుల్లో అమ‌ర వీరుడైన మేజ‌ర్ సందీప్ ఉన్నికృష్ణ‌న్ జీవిత క‌థ ఆధారంగా రూపొందిన ఈ చిత్రం జూన్ 3న విడుద‌లై సంచ‌ల‌న విజ‌యం సాధించింది. పోటీగా విక్ర‌మ్ సినిమా ఉన్నా మేజ‌ర్ మంచి వ‌సూళ్ళ‌ను సాధించింది. ఈ చిత్రంతో శేష్ 60కోట్ల క్ల‌బ్‌లోకి అడుగుపెట్టి టైర్‌2 హీరోల‌లో టాప్5లో చోటు ద‌క్కించుకున్నాడు. ఈ సినిమా చూసిన పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు మేజర్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అంటూ కితాబిస్తున్నారు. ఇక ఈ సినిమా చూస్తూ ప్రేక్షకులు ఎమోషనల్‌ అవుతూ కన్నీరు పెట్టుకుంటున్నారు.

తాజాగా చిత్రం బృందం ఈ మూవీ నుంచి ఓ ఎమోషనల్‌ వీడియో సాంగ్‌ను రిలీజ్‌ చేశారు. ‘కన్నా కన్నా’ అంటూ సాగే ఈ పాటలో మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ బాల్యం నుంచి సైన్యంలో చేరేందుకు బయలుదేరే పలు సన్నివేశాలను చూపించారు. ఈ పాటకు సోషల్‌ మీడియాలో మంచి స్పందన వస్తోంది. రామజోగయ్య శాస్త్రీ రచించిన ఈ పాటకు శ్రీ చరణ్‌ పాకాల స్వరాలు సమకుర్చగా.. ప్రముఖ గాయనీ చిత్ర ఆలపించారు. ప్రస్తుతం ఈ పాట నెటిజన్లకు బాగా ఆకట్టుకుంటోంది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement