NBK109 Title and Teaser: బాలయ్య అభిమానులకు పండగలాంటి న్యూస్, ఎన్‌బీకే 109 టైటిల్ టీజర్ వచ్చేస్తోంది, ఎప్పుడు విడుదలంటే..
టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ఎన్‌బీకే 109. తాజాగా ఈ మూవీ నుంచి సాలిడ్ అప్‌డేట్‌ను పంచుకున్నారు మేకర్స్. ఈ సినిమా టైటిల్ టీజర్‌ను రేపు ఉదయం 10.24 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. అలాగే ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు పోస్టర్‌ను విడుదల చేసింది.

వాల్తేరు వీరయ్యతో గతేడాది బ్లాక్ బస్టర్ అందుకున్న బాబీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమా బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్‌తో పాటు కన్నడ నటుడు రిషి విలన్ పాత్రల్లో నటించబోతున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ డ్యాన్సింగ్ క్వీన్ ఊర్వశి రౌటేలా ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోండగా.. ఊర్వశి రౌటేలా పోలీసాఫీసర్‌గా కనిపించబోతుంది. చాందినీ చౌదరి కీలక పాత్ర పోషిస్తోంది.
Update Here