Vijayakanth Health Update: నటుడు విజయ్ కాంత్‌‌కు అస్వస్థత, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, వైద్యులు చికిత్స అందిస్తున్నట్టు డీఎండీకే వర్గాలు, గతేడాది కరోనా బారీన పడిన డీఎండీకే పార్టీ అధినేత

ప్రముఖ తమిళ నటుడు, డీఎండీకే పార్టీ అధినేత కెప్టెన్‌ విజయ్‌ కాంత్‌ అస్వస్థతకు గురయ్యారు. బుధవారం తెల్లవారు జామున శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నట్టు డీఎండీకే వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి.

Vijayakanth

రొటీన్ హెల్త్ చెకప్ కోసం ఆసుపత్రిలో చేరినట్టు వారు చెప్పారు. ప్రస్తుతం ఆయన చెన్నైలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని డీఎండీకే ఓ ప్రకటనలో పేర్కొంది. ఒకటి రెండు రోజుల చికిత్స అనంతరం ఆసుపత్రి నుంచి డిశ్చార్చ్ అవుతారని కూడా డీఎండీకే వర్గాలు తెలిపాయి.

గత కొద్దికాలంగా విజయ కాంత్ పలు ఆరోగ్య సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్నారు. 2020 సెప్టెంబర్‌లో విజయకాంత్ కరోనా పాజిటివ్ బారిన పడ్డారు. దీంతో ఆసుపత్రిలో చికిత్స అనంతరం డిశ్చార్చి అయ్యారు. విజయకాంత్ తర్వాత ఆయన భార్య ప్రేమలత కూడా కోవిడ్ బారిన పడి, అక్టోబర్ 2న ఆసుపత్రి నుంచి డిశ్చార్చి అయ్యారు.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement