Vishwambhara: చిరంజీవి కొత్త సినిమాకు విశ్వంభర టైటిల్, సంక్రాంతి సందర్భంగా గ్లింప్స్ విడుదల చేసిన మేకర్స్, సోషియోఫాంటసీ మూవీగా రానున్న మెగా 156 మూవీ
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా టైటిల్‌ను వెల్లడించారు.గతేడాది దసరా రోజున ‘విశ్వానికి మించి..’ అనే ఆసక్తికరమైన పోస్టర్‌తో ఈ చిత్రాన్ని ప్రారంభించగా.. నేడు సంక్రాంతి సందర్భంగా విశ్వంభర టైటిల్‌ను ప్రకటించారు. ఈ మేరకు ఓ కాన్సెప్ట్ వీడియోను పంచుకున్నారు.
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా టైటిల్‌ను వెల్లడించారు.గతేడాది దసరా రోజున ‘విశ్వానికి మించి..’ అనే ఆసక్తికరమైన పోస్టర్‌తో ఈ చిత్రాన్ని ప్రారంభించగా.. నేడు సంక్రాంతి సందర్భంగా విశ్వంభర టైటిల్‌ను ప్రకటించారు. ఈ మేరకు ఓ కాన్సెప్ట్ వీడియోను పంచుకున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజా రగ్బీ ఆకారం లాంటి ఓ వస్తువు.. పలు లోకాల్లో ప్రయాణించడాన్ని ఈ కాన్సెప్ట్ వీడియోలో చూపించారు.
వీడియో ఆధారంగా చూస్తే ఇదో సోషియో ఫాంటసీ మూవీ అని అర్థమవుతోంది. ‘బింబిసార’ వంటి సూపర్ హిట్ తర్వాత వశిష్ఠ దర్శకత్వంలో రానున్న సినిమా కావడం.. మెగా స్టార్ హీరోగా తెరకెక్కుతుండడంతో దీనిపై అంచనాలు నెలకొన్నాయి.ఇందులో చిరు సరసన అనుష్క శెట్టి, మృణాల్ ఠాకూర్ నటించనున్నారనే వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రానికి కీరవాణి సంగీతమందిస్తున్నారు. దీనితో పాటు చిరంజీవి తన కుమార్తె సొంత నిర్మాణ సంస్థ ‘గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్’పై 157వ సినిమా చేయనున్నారు.
Here's Video