Aditi Rao Hydari and Siddharth Wedding: పెళ్లి చేసుకున్న హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితి, అందమైన క్యాప్షన్‌తో పెళ్లి ఫోటోలను విడుదల చేసిన హీరోయిన్

హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితి రావు హైదరీ పెళ్లి చేసుకున్నారు. కొంత‌కాలంగా ప్రేమించుకుంటున్న వీరిద్ద‌రూ ఇటీవ‌లే నిశ్చితార్థం చేసుకున్నారు. తాజాగా కుటుంబ స‌భ్యులు, బంధువుల మ‌ధ్య ఘ‌నంగా వ‌న‌ప‌ర్తి జిల్లా శ్రీరంగాపురంలోని రంగ‌నాయ‌క‌స్వామి ఆల‌యంలో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. వీరి పెళ్లి దక్షిణాది సంప్రదాయం ప్రకారం జరిగింది.

Aditi Rao Hydari and Siddharth (Photo Credits: Instagram)

హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితి రావు హైదరీ పెళ్లి చేసుకున్నారు. కొంత‌కాలంగా ప్రేమించుకుంటున్న వీరిద్ద‌రూ ఇటీవ‌లే నిశ్చితార్థం చేసుకున్నారు. తాజాగా కుటుంబ స‌భ్యులు, బంధువుల మ‌ధ్య ఘ‌నంగా వ‌న‌ప‌ర్తి జిల్లా శ్రీరంగాపురంలోని రంగ‌నాయ‌క‌స్వామి ఆల‌యంలో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. వీరి పెళ్లి దక్షిణాది సంప్రదాయం ప్రకారం జరిగింది.  జాతీయ అవార్డు అందుకున్న ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ పై రేప్ కేసు నమోదు.. ఎందుకంటే?

ఈ జంట తమ పెళ్లి ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. "నువ్వు నా సూర్యుడు, నా చంద్రుడు.. అలాగే నువ్వే నా తారాలోకం. మిసెస్ అండ్ మిస్ట‌ర్ అదు సిద్ధు" అని అందమైన క్యాప్షన్‌తో అదితి రావు హైదరీ తమ పెళ్లి ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ప్ర‌స్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. దాంతో ఈ నూత‌న జంట‌కు నెటిజ‌న్లు శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు. ఇక సిద్ధార్థ్‌తో రిలేష‌న్‌పై అదితి ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించారు. తామిద్ద‌రం జంట‌గా న‌టించిన మ‌హా స‌ముద్రం సినిమా షూటింగ్ స‌మ‌యంలో త‌మ మ‌ధ్య ఏర్ప‌డిన ప‌రిచ‌యం, ఆ త‌ర్వాత ప్రేమ‌గా మారింద‌ని ఆమె చెప్పారు.

Here's Pics

 

View this post on Instagram

 

A post shared by Aditi Rao Hydari (@aditiraohydari)

 

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement