Anand Mahindra: అగ్ని వీరులకు ఆనంద్ మహీంద్రా బంపరాఫర్, క్రమశిక్షణ కలిగిన అగ్ని వీరులకు మహీంద్రా గ్రూపులో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని వెల్లడి

శిక్షణ, క్రమశిక్షణ కలిగిన అగ్ని వీరులకు బంగారు భవిష్యత్తు ఉంటుందన్నారు. విజయవంతంగా శిక్షణ, సర్వీసు పూర్తి చేసుకున్న అగ్నివీరులకు మహీంద్రా గ్రూపులో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానంటూ ముందుకొచ్చారాయన.

Anand Mahindra (Photo-Twitter/@Anand Mahindra)

ట్విట్టర్లో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఆనంద్‌ మహీంద్రా తాజాగా అగ్నిపథ్‌ పై స్పందించారు. అగ్నిపథ్‌ పథకం చుట్టూ చెలరేగిన వివాదం పట్ల ఆనంద్‌ మహీంద్రా విచారం వ్యక్తం చేశారు. ఈ పథకం వస్తుందని ఏడాది కిందట విన్నప్పుడు చెప్పిన అభిప్రాయాలే ఇప్పుడు తనకు ఉన్నాయని ఆయన తెలిపారు. శిక్షణ, క్రమశిక్షణ కలిగిన అగ్ని వీరులకు బంగారు భవిష్యత్తు ఉంటుందన్నారు. విజయవంతంగా శిక్షణ, సర్వీసు పూర్తి చేసుకున్న అగ్నివీరులకు మహీంద్రా గ్రూపులో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానంటూ ముందుకొచ్చారాయన.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement