Article 370 Verdict Today: జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370పై నేడు తీర్పు, జమ్ముకశ్మీర్‌లో భద్రత కట్టుదిట్టం చేసిన అధికారులు
జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ మోదీ సర్కారు తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ పరంగా చెల్లుబాటు అవుతుందా లేదా అన్న అంశంపై సుప్రీంకోర్టు సోమవారం తీర్పు వెలువరించనున్నది. కేంద్రం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తమ నిర్ణయాన్ని ప్రకటించనుంది.

ఈ నేపథ్యంలో జమ్ముకశ్మీర్‌లో భద్రతను కట్టుదిట్టం చేశారు. 2019 ఆగస్టు 5న కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేసింది. జమ్ముకశ్మీర్‌ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పలువురు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. 16 రోజులపాటు సుదీర్ఘ వాదనలు విన్న సీజేఐ ధర్మాసనం.. సెప్టెంబర్ 5న తీర్పును రిజర్వ్ చేసింది.నేడు తీర్పును వెలువరించనుంది.
Here's PTI News