Heroin Seized: రూ.47కోట్ల విలువైన హెరాయిన్‌ పట్టివేత, సబ్బు సంచుల్లో పెట్టి స్మగ్లింగ్, అసోంలో స్వాధీనం చేసుకున్న పోలీసులు

అసోంలో రూ.47కోట్ల విలువైన హెరాయిన్‌ను పోలీసులు పట్టుకున్నారు. బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌, పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్‌ నిర్వహించి డ్రగ్స్‌ ముఠాను పట్టుకున్నారు. పోలీసులు ట్రక్‌ డ్రైవర్‌ అరెస్టు చేయగా.. మరికొందరు నిందితుల కోసం గాలిస్తున్నారు.

Heroine Seized (photo credit- IANS)

అసోంలో రూ.47కోట్ల విలువైన హెరాయిన్‌ను పోలీసులు పట్టుకున్నారు. బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌, పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్‌ నిర్వహించి డ్రగ్స్‌ ముఠాను పట్టుకున్నారు. పోలీసులు ట్రక్‌ డ్రైవర్‌ అరెస్టు చేయగా.. మరికొందరు నిందితుల కోసం గాలిస్తున్నారు.మిజోరాం నుంచి కరీంగంజ్‌ మీదుగా త్రిపుర వెళ్తున్న ట్రక్కులో రూ.కోట్ల విలువైన హెరాయిన్‌ను తరలిస్తున్నట్లు అధికారులకు సమాచారం అందించింది.బీఎస్‌ఎఫ్‌, కరీంగంజ్‌ పోలీసులు కరీంగంజ్‌ రైల్వేస్టేషన్‌కు సమీపంలో ట్రక్కు నుంచి హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. హెరాయిన్‌ను సబ్బు సంచుల్లో పెట్టి.. డ్రైవర్‌ క్యాబిన్‌లో దాచినట్లు పోలీసులు చెప్పారు. హెరాయిన్‌ 9.47 కిలోలు కాగా, విలువ రూ. 47.4 కోట్లు ఉంటుందని పోలీసు అధికారులు తెలిపారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement