SpiceJet Flight: స్పైస్‌జెట్‌ విమానం గాల్లోకి ఎగురుతుండగా విరిగిన ఇంజిన్‌ బ్లేడ్లు, వెనక్కి మళ్లించి ఎయిర్‌పోర్ట్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ చేసిన ఫైలట్స్

పశ్చిమబెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో స్పైస్‌జెట్‌కు చెందిన బోయింగ్‌ 737 విమానం టేకాఫ్‌ సమయంలో ఇంజిన్‌ బ్లేడ్లు విరిగాయి. దీంతో ఆ విమానాన్ని వెనక్కి మళ్లించి ఎయిర్‌పోర్ట్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ చేశారు.ఆదివారం అర్ధ రాత్రి తర్వాత 1.09 గంటలకు స్పైస్‌జెట్‌కు చెందిన బోయింగ్‌ 737 విమానం కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌ నుంచి బ్యాంకాక్‌కు బయలుదేరింది.

SpiceJet aircraft. Representational image. (Photo Credits: File)

పశ్చిమబెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో స్పైస్‌జెట్‌కు చెందిన బోయింగ్‌ 737 విమానం టేకాఫ్‌ సమయంలో ఇంజిన్‌ బ్లేడ్లు విరిగాయి. దీంతో ఆ విమానాన్ని వెనక్కి మళ్లించి ఎయిర్‌పోర్ట్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ చేశారు.ఆదివారం అర్ధ రాత్రి తర్వాత 1.09 గంటలకు స్పైస్‌జెట్‌కు చెందిన బోయింగ్‌ 737 విమానం కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌ నుంచి బ్యాంకాక్‌కు బయలుదేరింది.

అయితే ఎయిర్‌పోర్ట్‌లో టేకాఫ్‌ అయిన సమయంలో ఆ విమానం ఎడమ ఇంజిన్‌లోని బ్లేడ్లు విరిగాయి. పైలట్లు వెంటనే దీనిని గ్రహించారు. ఆ విమానాన్ని వెనక్కి మళ్లించారు. 1.27 గంటలకు తిరిగి ఎయిర్‌పోర్ట్‌లో సురక్షితంగా ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ చేశారు. బ్యాంకాక్‌కు వెళ్లాల్సిన178 మంది ప్రయాణికులతోపాటు ఆరుగురు సిబ్బంది ఆ విమానంలో ఉన్నారు.ఈ సంఘటన నేపథ్యంలో మరో విమానాన్ని ఏర్పాటు చేసినట్లు స్పైస్‌జెట్ తెలిపింది.

Here's Update

Share Now
Advertisement

Advertisement
Share Now
Advertisement