Sonia Gandhi Dance Video: సోనియాగాంధీ డ్యాన్స్ వీడియో ఇదిగో, మహిళా రైతులతో కలిసి చిందేసిన కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు
కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ.. తన నివాసానికి వచ్చిన రైతులతో కలిసి చిందేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆ పార్టీ పంచుకోగా.. వైరల్‌గా మారింది.
కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ.. తన నివాసానికి వచ్చిన రైతులతో కలిసి చిందేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆ పార్టీ పంచుకోగా.. వైరల్‌గా మారింది. ఈ నెల 8న రాహుల్‌గాంధీ హరియాణా పర్యటన సమయంలో సోనీపత్ జిల్లా మదీనా గ్రామంలో మహిళా రైతులు.. రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఇంటిని చూడాలని కోరారు. దాంతో రాహుల్ ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసి వారిని సోనియా నివాసానికి ఆహ్వానించారు.
మహిళా రైతులను సోనియా కుటుంబం సాదరంగా ఆహ్వానించింది. వారికి ప్రత్యేక ఆతిథ్యం ఏర్పాటు చేయడమే గాక.. సోనియా, ప్రియాంక గాంధీ కూడా మహిళలతో కలిసి భోజనం చేశారు. అనంతరం వారితో సరదాగా ముచ్చటించారు. మహిళా రైతులు సోనియాను నృత్యం చేయాలని కోరగా.. అందుకు ఆమె అంగీకరించి వారితో కలిసి డ్యాన్స్ ఆడారు. దీనికి సంబంధించిన వీడియోను కాంగ్రెస్ నేత ఒకరు పంచుకుంటూ.... ఇది స్వచ్ఛమైన సంతోషం అని రాసుకోచ్చారు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)