Karnataka Hijab Row: హిజాబ్‌ ధరించి స్కూలుకు వచ్చిన విద్యార్థినులు, అడ్డుకున్న ఉపాధ్యాయులు, హిజాబ్ తీసేసి పాఠ‌శాల‌లోకి వెళ్లిన విద్యార్థినులు, మాండ్యలోని రోట‌రీ స్కూల్‌లో ఘ‌ట‌న

కర్ణాట‌క‌లో ప్రారంభ‌మైన హిజాబ్‌ వివాదం దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశమైన విష‌యం తెలిసిందే. నేటి నుంచి మ‌ళ్లీ కర్ణాటకలో పాఠశాలలు తిరిగి తెరుచుకున్నాయి. దీంతో మ‌ళ్లీ హిజాబ్ వివాదం ప్రారంభ‌మైంది. కొంద‌రు విద్యార్థినులు హిజాబ్‌ ధరించి పాఠ‌శాల‌లోకి వ‌స్తుండ‌డాన్ని చూసిన‌ ఓ ఉపాధ్యాయురాలు వారిని అడ్డుకుంది. దీంతో ఆ ఉపాధ్యాయురాలితో విద్యార్థినుల త‌ల్లిదండ్రులు గొడ‌వ పెట్టుకున్నారు.

Hijab Row Turns Violent in Karntaka (Photo Credits: IANS)

కర్ణాట‌క‌లో ప్రారంభ‌మైన హిజాబ్‌ వివాదం దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశమైన విష‌యం తెలిసిందే. నేటి నుంచి మ‌ళ్లీ కర్ణాటకలో పాఠశాలలు తిరిగి తెరుచుకున్నాయి. దీంతో మ‌ళ్లీ హిజాబ్ వివాదం ప్రారంభ‌మైంది. కొంద‌రు విద్యార్థినులు హిజాబ్‌ ధరించి పాఠ‌శాల‌లోకి వ‌స్తుండ‌డాన్ని చూసిన‌ ఓ ఉపాధ్యాయురాలు వారిని అడ్డుకుంది. దీంతో ఆ ఉపాధ్యాయురాలితో విద్యార్థినుల త‌ల్లిదండ్రులు గొడ‌వ పెట్టుకున్నారు. మాండ్యలోని రోట‌రీ స్కూల్‌లో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.

ఇందుకు సంబంధించిన దృశ్యాలు మీడియాకు చిక్కాయి. పాఠ‌శాల‌లోకి అడుగు పెట్టేముందే హిజాబ్ తీసేయాల‌ని ఉపాధ్యాయురాలు చెప్పింది. దీంతో చివ‌ర‌కు హిజాబ్ తీసేసి విద్యార్థినులు పాఠ‌శాల‌లోకి వెళ్లారు. హిజాబ్‌తోనే పాఠ‌శాల‌లోకి అనుమ‌తించాల‌ని ఉపాధ్యాయురాలిని త‌ల్లిదండ్రులు వేడుకున్న‌ప్ప‌టికీ ఆమె వినిపించుకోలేదు. కాగా, హిజాబ్ అంశం ప్ర‌స్తుతం కోర్టు ప‌రిధిలో ఉన్న విష‌యం తెలిసిందే.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Share Now
Advertisement