Jammu and Kashmir: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు, ఒక టెర్రరిస్టు హతమార్చిన భారత బలగాలు

జమ్ముకశ్మీర్‌లోని అవంతీపొరాలో (Awantipora) ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఒక టెర్రరిస్టు హతమయ్యాడు. జిల్లాలోని త్రాల్‌లో ఉగ్రవాదులు నక్కిఉన్నారనే సమాచారంతో స్థానిక పోలీసులు, భద్రతా బలగాలు గాలింపు చేపట్టారు.

Security Forces in Jammu and Kashmir. (Photo Credits: ANI)

జమ్ముకశ్మీర్‌లోని అవంతీపొరాలో (Awantipora) ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఒక టెర్రరిస్టు హతమయ్యాడు. జిల్లాలోని త్రాల్‌లో ఉగ్రవాదులు నక్కిఉన్నారనే సమాచారంతో స్థానిక పోలీసులు, భద్రతా బలగాలు గాలింపు చేపట్టారు. ఈ సందర్భంగా ఇరుపక్షాల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడని కశ్మీర్‌ పోలీసులు వెల్లడించారు. అతడు ఏ గ్రూప్‌నకు సంబంధించినవాడనే విషయం గుర్తించాల్సి ఉందన్నారు. ఆ ప్రాంతంలో ఆపరేషన్‌ ఇంకా కొనసాగుతున్నదని చెప్పారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement