Karnataka: మైసూరులో ప్రధాని మోదీ రోడ్ షోతో రహదారి అపవిత్రం, గో మూత్రం,పేడతో ఆ మార్గాన్ని శుభ్రం చేసిన కాంగ్రెస్ శ్రేణులు, ముగ్గురిపై కేసు నమోదు
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో మైసూర్ కేఆర్ సర్కిల్ (Mysore KR circle) నుంచి హైవే సర్కిల్ వరకు ఈ రోడ్ షో ప్రధాని మోదీ రోడ్ నిర్వహించిన సంగతి విదితమే.
ప్రధాని మోదీ (PM Modi) రోడ్ షో (Road Show) నిర్వహించిన మార్గాన్ని కాంగ్రెస్ (Congress) శ్రేణులు గో మూత్రం, పేడ (cow dung)తో శుభ్రం చేశాయి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో మైసూర్ కేఆర్ సర్కిల్ (Mysore KR circle) నుంచి హైవే సర్కిల్ వరకు ఈ రోడ్ షో ప్రధాని మోదీ రోడ్ నిర్వహించిన సంగతి విదితమే. మోదీ రోడ్ షో కారణంగా ఆ మార్గం అపవిత్రమైందని కాంగ్రెస్ శ్రేణులు ఆరోపించారు. ఈ మేరకు ఆ రహదారిని ఆవు మూత్రం, పేడతో శుభ్రం చేశారు. రాజమార్గంలో మోదీ రోడ్ షో నిర్వహించడం చాలా పెద్ద తప్పని.. ఇది మైసూర్ రాజకుటుంబాన్ని అవమానించడమే అవుతుందని వారు తెలిపారు. అయితే క్లీనింగ్ పనులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ కార్యక్రమంతో ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నారని ముగ్గురిపై కేసు నమోదు చేశారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)