Hyderabad: వీడియో ఇదిగో, కూకట్‌పల్లిలో సోదరిని వేధించినందుకు యువకుడిని హత్య చేసిన అన్న, చపాతీ కర్రతో తలపై కొట్టడంతో అక్కడికక్కడే మృతి
హైదరాబాద్ నగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. టీ తాగేందుకు వచ్చిన తమ సోదరి పై కామెంట్ చేశాడన్న కారణంతో ఓ వ్యక్తిని చపాతీ కర్రతో కొట్టి చంపిన సంఘటన కూకట్‌పల్లిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
హైదరాబాద్ నగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. టీ తాగేందుకు వచ్చిన తమ సోదరి పై కామెంట్ చేశాడన్న కారణంతో ఓ వ్యక్తిని చపాతీ కర్రతో కొట్టి చంపిన సంఘటన కూకట్‌పల్లిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకట రమణ అనే వ్యక్తి ఈ నెల 22వ తేదీ రాత్రి తన స్నేహితులతో కలిసి మద్యం సేవించి కూకట్‌పల్లి ఓ ఆఫీస్ వద్దకు టీ తాగేందుకు వచ్చారు.
అదే సమయంలో శ్రీధర్, అజయ్, పవన్, సురేష్ లు తమ సోదరితో కలిసి టీ తాగేందుకు వచ్చారు. శ్రీధర్ సోదరి పై వెంకట రమణ కామెంట్ చెయ్యటంతో, ఆ నలుగురు వెంకట రమణ పై తీవ్ర స్థాయిలో దాడికి పాల్పడ్డారు. అక్కడే ఉన్న ఓ టిఫిన్ సెంటర్ లోని చపాతీ కర్రతో రమణ తలపై దారుణంగా కొట్టారు. ఈ ఘటనలో వెంకట రమణ అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానిక సమాచారంతో ఘటన వద్దకు పోలీసులు చేరుకున్నారు. దాడికి పాల్పడిన నలుగురిని అదుపులో తీసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
young man killed for molesting woman in Hyderabad Kukatpally