Nitish Kumar Resigns: ముఖ్య‌మంత్రి ప‌ద‌వికి నితీష్ కుమార్ రాజీనామా, ఆర్జేడీతో క‌లిసి కొత్త ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం, బీహార్‌లో ముగిసిన బీజేపీ-జేడీయూ కూటమి పాలన

బీహార్ జేడీయూ అధినేత నితీష్ కుమార్ ముఖ్య‌మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేశారు. పాట్నాలోని రాజ్‌భ‌వ‌న్‌లో ఆ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్‌ను క‌లిసి రాజీనామా ప‌త్రాన్ని స‌మ‌ర్పించారు. రాష్ట్రీయ జ‌న‌తా ద‌ళ్‌(ఆర్జేడీ)తో క‌లిసి నితీష్ కుమార్ కొత్త ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసే అవ‌కాశం ఉందని సమాచారం.

Bihar CM Nitish Kumar (photo-ANI)

బీహార్ జేడీయూ అధినేత నితీష్ కుమార్ ముఖ్య‌మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేశారు. పాట్నాలోని రాజ్‌భ‌వ‌న్‌లో ఆ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్‌ను క‌లిసి రాజీనామా ప‌త్రాన్ని స‌మ‌ర్పించారు. రాష్ట్రీయ జ‌న‌తా ద‌ళ్‌(ఆర్జేడీ)తో క‌లిసి నితీష్ కుమార్ కొత్త ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసే అవ‌కాశం ఉందని సమాచారం.కాగా పార్టీ స‌భ్యులంద‌రి ఏకాభిప్రాయంతోనే రాజీనామా చేసిన‌ట్లు నితీష్ కుమార్ ప్ర‌క‌టించారు.

బీహార్‌లో ఎన్డీఏ కూట‌మి ప్ర‌భుత్వంలో సీఎంగా ఉన్న నితీశ్ కుమార్‌.. బీజేపీతో క‌లిసి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసిన విష‌యం తెలిసిందే. అయితే కొన్నాళ్ల నుంచి బీజేపీతో సంబంధాలు స‌రిగా లేని కార‌ణంగా.. ఆ కూట‌మికి ఇవాళ గుడ్‌బై చెప్పేశారు. దీంతో బీజేపీ(77)-జేడీయూ(45) కూట‌మి పాల‌న బీహార్‌లో ముగిసిపోయింది.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement