Telangana: వీడియో ఇదిగో.. మెట్‌పల్లిలో తాగుబోతు వీరంగం.. ఆర్టీసీ బస్సును అడ్డుకుని డ్రైవర్, భార్యపై దాడికి యత్నం..

Jagtial RTC Bus Incident

Telangana: జగిత్యాల జిల్లా మెట్‌పల్లి బస్ డిపో వద్ద ఒక మద్యం బాబు తీవ్ర కలకలం సృష్టించాడు. మద్యం మత్తులో ఊగుతూ రోడ్డుపై వెళ్తున్న ఆర్టీసీ 'రాజధాని' బస్సును అడ్డుకోవడమే కాకుండా, విధి నిర్వహణలో ఉన్న డ్రైవర్‌పై దాడికి యత్నించాడు. ఈ క్రమంలో అతనిని వారించేందుకు ప్రయత్నించిన భార్యపై కూడా సదరు తాగుబోతు భౌతిక దాడికి దిగాడు. అక్కడ ఉన్న ప్రయాణికులు, స్థానికులు అతనిని అడ్డుకోబోగా, వారిపైకి కూడా తీవ్రంగా విరుచుకుపడుతూ దాడికి యత్నించాడు. దీంతో బస్ డిపో వద్ద కొంతసేపు తీవ్ర తీవ్ర ఉద్రిక్తత, ప్రయాణికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ప్రయాణికులకు, రవాణా శాఖ సిబ్బందికి భంగం కలిగించిన సదరు తాగుబోతుపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.  వీడియో ఇదిగో.. ఆటోను తప్పించబోయి పెట్రోల్ బంకులోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. తృటిలో తప్పిన పెనుప్రమాదం..

Jagtial RTC Bus Incident Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement