Kancheepuram: ఇదేం చోద్యం, దేవాలయం హోర్డింగ్‌లో పోర్న్ స్టార్ మియా ఖలీఫా ఫొటో, తమిళనాడులో మండిపడుతున్న భక్తులు
తమిళనాడులోని కాంచీపురం జిల్లాలో ఒక పండగ కోసం ఏర్పాటు చేసిన హోర్డింగ్‌లో పోర్న్ స్టార్ మియా ఖలీఫా ఫొటో కనిపించడం తీవ్ర కలకలం రేపింది. ప్రస్తుతం అక్కడ రాష్ట్ర వ్యాప్తంగా హిందూ ఆలయాల్లో పార్వతి దేవతను పూజించే 'ఆడి' పండుగ జరుగుతుంది. ఈ క్రమంలో వేడుకల్లో హోర్డింగ్‌లను కూడా ఏర్పాటుచేశారు.

అయితే కురువిమలైలోని నాగతమ్మన్, సెల్లియమ్మన్ ఆలయాల వద్ద పండుగ దీపాలతో పాటు హోర్డింగ్‌లను ఏర్పాటు చేయగా, వాటిలో దేవత ఫొటోలతో పాటు, మియా ఖలీఫా ఫొటో కూడా ఉంది. ఆమె, పండుగ సాంప్రదాయ నైవేద్యాలలో భాగమైన 'పాల్ కుడం' (పాల పాత్ర)ని ఎత్తుకుని తీసుకెళ్తున్నట్లుగా ఉంది. అలాగే ఆ హోర్డింగ్‌లో దానిని ఏర్పాటు చేసిన వారి ఫొటోలను, వాటి క్రింద తమ పేర్లను కూడా ముద్రించుకున్నారు. దీనిని చూసిన పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హోర్డింగ్‌కు సంబంధించిన ఫొటో వైరల్ కావడంతో, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దానిని తొలగించారు. వీడియో ఇదిగో, యూట్యూబ్‌లో చూసి బాంబులు తయారు చేసిన పిల్లలు, ఒక్కసారిగా అవి పేలడంతో గాయాలపాలై ఆస్పత్రిపాలు..
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)