Madha Gaja Raja: వీడియో ఇదిగో, బక్కచిక్కిపోయి దీన స్థితిలో కనిపించిన విశాల్, మైక్‌ పట్టుకుని మాట్లాడుతుంటే చేతులు, గొంతు వణికుతున్న క్లిప్ ఇదిగో..

Vishal (Photo Credits: X)

హీరో విశాల్‌ (Vishal) ప్రధాన పాత్రలో నటించిన మదగజరాజ మూవీ (Madha Gaja Raja Movie) షూటింగ్‌ 2012లోనే పూర్తయిన సంగతి తెలిసిందే, అయితే పలు కారణాల వల్ల ఎన్నో ఏళ్లుగా విడుదలకు నోచుకోలేదు. ఎట్టకేలకు ఈ చిత్రం ఈ ఏడాది జనవరి 12న రిలీజ్‌ అవుతోంది. తాజాగా చెన్నైలో ఈ సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ చేశారు. ఈ కార్యక్రమానికి పంచెకట్టులో హాజరైన విశాల్‌ బక్కచిక్కిపోయి దీన స్థితిలో కనిపించాడు. మైక్‌ పట్టుకుని మాట్లాడుతుంటే చేతులు, గొంతు వణుకుతోంది. ఆయన కొద్దిరోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నాడని.. దానివల్లే శరీరం, గొంతు వణుకుతోందని పలువురు చెప్తున్నారు. తన ఆరోగ్య పరిస్థితిని లెక్క చేయకుండా విశాల్‌ ఈవెంట్‌కు వచ్చాడని తెలుసుకున్న అభిమానులు.. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితిలో తన సినిమా కోసం ఈవెంట్‌కు రావడం చిన్న విషయం కాదని, అతడి అంకితభావాన్ని మెచ్చుకోవాల్సిందేనని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ముందస్తు బెయిల్ కోరుతూ సుప్రీంకోర్టులో మోహన్‌బాబు పిటిషన్, విచారణకు స్వీకరించిన ధర్మాసనం, తదుపరి విచారణ గురువారానికి వాయిదా

Hero Vishal Attends Event Amidst Illness

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement