Chiranjeevi: వీడియో ఇదిగో, సెల్ఫీ కోసం ప్రయత్నించిన అభిమానిని తోసేసిన మెగాస్టార్ చిరంజీవి, నెటిజన్ల రియాక్షన్ ఏంటంటే..
ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ వ్యక్తి మెగాస్టార్‌తో సెల్ఫీ కోసం ఎగబడ్డాడు. అయితే సెల్ఫీ కోసం వచ్చిన సిబ్బందిని మెగాస్టార్ పక్కకు తోసేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఒక అభిమాని పట్ల ఇలా వ్యవహరించడం సరైంది కాదని కొందరు నెటిజన్స్ మండిపడుతున్నారు.
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం బింబిసార్ ఫేమ్ వశిష్ట డైరెక్షన్ తెరకెక్కుతున్న విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. షూటింగ్‌కు కాస్తా గ్యాప్ ఇచ్చిన మెగాస్టార్ తన ఫ్యామిలీతో కలిసి పారిస్ ఒలింపిక్స్‌లో ఎంజాయ్ చేస్తున్నారు. అయితే తాజాగా మెగాస్టార్ ఎయిర్‌పోర్ట్‌లో కనిపించారు. అదే సమయంలో నడుచుకుంటూ వెళ్తున్న చిరంజీవితో అక్కడే ఉన్న కొందరు సిబ్బంది సెల్పీలు దిగేందుకు యత్నించారు. పారిస్ ఒలింపిక్స్ కోసం మనువరాలితో కలిసి వెళ్లిన చిరంజీవి, లండన్ పార్కులో క్లింకారతో కలిసి చిరు, రామ్ చరణ్ దంపతుల ఫోటో వైరల్
అందులో ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ వ్యక్తి మెగాస్టార్‌తో సెల్ఫీ కోసం ఎగబడ్డాడు. అయితే సెల్ఫీ కోసం వచ్చిన సిబ్బందిని మెగాస్టార్ పక్కకు తోసేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఒక అభిమాని పట్ల ఇలా వ్యవహరించడం సరైంది కాదని కొందరు నెటిజన్స్ మండిపడుతున్నారు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)