Russia-Ukraine Conflict: కన్నీరుపెట్టిస్తున్న ఉక్రెయిన్‌ సైనికుడి వీడియో, మామ్, డాడ్ ఐ ల‌వ్ యూ అంటూ కుటుంబానికి సందేశం ఇస్తున్న సైనికుడు, నెట్టింట వైరల్ అవుతున్న 13 సెకన్ల వీడియో

ఉక్రెయిన్‌ను చెందిన ఓ సైనికుడు విడుద‌ల చేసిన సందేశం సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్‌ అవుతోంది. ఓ వీడియోలో సైనికుడు త‌న కుటుంబ స‌భ్యుల‌కు సందేశాన్ని పంపాడు. మామ్, డాడ్ ఐ ల‌వ్ యూ.. అంటూ అత‌ను పేర్కొన్నాడు. 13 సెకన్ల వీడియోలో సైనికుడు తన కుటుంబానికి సందేశం ఇస్తున్నట్లు కనిపించాడు.

Representational Image

ఉక్రెయిన్‌పై ర‌ష్యా బాంబుల దాడితో, మిసైళ్ల వ‌ర్షం కురిపిస్తోంది. ఎక్కడికక్కడ మిల‌ట‌రీ స్థావ‌రాల‌ను ధ్వంసం చేసింది. తాజాగా రాజధాని కీవ్ లోకి ప్రవేశించింది. ఇప్పుడు ఉక్రెయిన్‌ను చెందిన ఓ సైనికుడు విడుద‌ల చేసిన సందేశం సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్‌ అవుతోంది. ఓ వీడియోలో సైనికుడు త‌న కుటుంబ స‌భ్యుల‌కు సందేశాన్ని పంపాడు. మామ్, డాడ్ ఐ ల‌వ్ యూ.. అంటూ అత‌ను పేర్కొన్నాడు. 13 సెకన్ల వీడియోలో సైనికుడు తన కుటుంబానికి సందేశం ఇస్తున్నట్లు కనిపించాడు. ఈ వీడియోపై నెటిజ‌న్లు స్పందించారు. ఉక్రెయిన్ సైనికుల ప‌ట్ల సానుభూతి వ్య‌క్తం చేశారు. మీరేవ‌రో మాకు తెలియ‌దు.. కానీ మిమ్మ‌ల్ని ప్రేమిస్తున్నాము అని ఉక్రెయిన్ సైనికుల‌ను ఉద్దేశించి నెటిజ‌న్లు వ్యాఖ్యానిస్తున్నారు. కాగా ర‌ష్యా ప్రారంభించిన యుద్ధంలో ఉక్రెయిన్‌కు చెందిన‌ 137 మంది పౌరులు చ‌నిపోయినట్లు ఆ దేశ అధికార‌ వ‌ర్గాలు వెల్ల‌డించాయి.

 

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement