Viral Video: వైరల్ వీడియో, నిన్ను క్షమించాలంటే నాకో ముద్దివ్వు, బుడ్డోడిని దారిలోకి తీసుకువచ్చిన ఓ టీచర్, సోషల్ మీడియాని షేక్ చేస్తోన్న వీడియో
వీడియోలో బుడ్డోడా నువ్ క్లాసులో బాగా అల్లరి చేస్తున్నావు నీతో కచ్చి అన్నట్లు ఆ టీచర్ బుంగమూతి పెట్టుకుంటుంది.వెంటనే నో టీచర్ ఇక మీద చేయను. సారీ అని టీచర్ దగ్గరకు వచ్చి చెబుతాడు.
సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలు అల్లరి చేస్తున్న ఓ బుడ్డోడిని టీచర్ దారి లోకి తీసుకువచ్చిన విధానం నెటిజన్లకు తెగ నచ్చేసింది. వీడియోలో బుడ్డోడా నువ్ క్లాసులో బాగా అల్లరి చేస్తున్నావు నీతో కచ్చి అన్నట్లు ఆ టీచర్ బుంగమూతి పెట్టుకుంటుంది.వెంటనే నో టీచర్ ఇక మీద చేయను. సారీ అని టీచర్ దగ్గరకు వచ్చి చెబుతాడు. ఐతే టీచర్ వెంటనే ఓప్పుకోలేదు.దానికి ఆ చిన్నోడు కూడా లేదు టీచర్ ఇకమీద అల్లరి చేయను అంటూ ఆమెను దగ్గరగా వాటేసుకుని మరీ చెబుతాడు.
నిన్ను క్షమించాలంటే నాకో ముద్దివ్వు అని అడుగుతుంది. అడిగిందే తడువు వాడు ఆ టీచర్ రెండు చెంపలపైన ముద్దు పెడతాడు. ఇదంతా వీడియో తీసి ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఇది చూసిన నెటిజనులు ఫుల్ ఫీదా అవుతున్నారు. పోస్ట్ పెట్టిన కాసేపట్లోనే వీడియో వైరల్‌గా మారింది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)