Viral Video: వీడియో ఇదిగో.. ప‌బ్లిక్‌లో జుట్లు ప‌ట్టుకొని, ఒకరిపై ఒకరు పిడిగుద్దులతో దాడి చేసుకున్న యువతులు.. బెంగళూరులోని కబ్బన్ పార్క్ వద్ద రీల్స్ విష‌యంలో ఇద్ద‌రి మ‌ధ్య గొడ‌వ‌

Two Women Clash While Trying to Make Reels (photo-Video Grab)

Viral Video: ఐటీ సిటీ బెంగళూరులోని ప్రసిద్ధ కబ్బన్ పార్క్ ఆదివారం రీల్స్ చేసే యువతుల గొడవకు వేదికైంది. వందలాది మంది సందర్శకులు చూస్తుండగానే.. సోషల్ మీడియా రీల్స్ చిత్రీకరణ విషయంలో ఇద్దరు యువతులు బహిరంగంగా ఘర్షణకు దిగారు.అటుగా వెళ్తున్న ఒక వ్యక్తి ఈ ఘటనను తన మొబైల్ ఫోన్ ద్వారా రికార్డ్ చేయగా.. సదరు వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ క్లిప్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

ఉపాధ్యాయుడితో స్టూటెంట్ రాసలీలలు వీడియో వైరల్.. ఇది నిజం కాదని MMS స్కాండల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని హచ్చరిక..

కాగా నగరంలోని ప్రముఖ ప్రాంతాల్లో రీల్స్ పిచ్చి ముదురుతుండటంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో విధాన సౌధ సమీపంలో కూడా నేపాలీ మూలాలకు చెందిన కొందరు యువతీ యువకులు రీల్స్ కోసం గొడవపడిన సంఘటనలు ఉన్నాయి. ప్రతి వారాంతంలోనూ, సెలవు దినాల్లోనూ ఫోటోలు, వీడియోల కోసం యువత ఇలా పరస్పరం పోట్లాడుకోవడానికి దిగడం నిత్యకృత్యంగా మారిందని సందర్శకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Two Women Clash While Trying to Make Reels at Cubbon Park

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement