Novak Djokovic Visa Controversy: ఆన్‌లైన్ కోర్టులో పోర్న్ వీడియోలు, ఒక్కసారిగా షాక్ తిన్న జడ్జీలు, నోవాక్ జోకోవిచ్‌కు వింత అనుభవం, వీసా రద్దు కేసులో సెర్బియా టెన్నిస్ స్టార్‌కు ఊరట
తన వీసా రద్దుకు వ్యతిరేకంగా ఆయన ఈ రోజు కోర్టు విచారణలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా నోవాక్ జొకోవిచ్ కోర్టు వ్యవహారాల వర్చువల్ సమావేశాన్ని ఒక హ్యకర్ హ్యాక్ చేశాడు. స్ట్రీమింగ్ లింక్‌లో సంగీతం, పోర్న్‌లను ప్రసారం చేశారు. దీంతో జడ్జీలు ఒక్కసారిగా షాక్ తిన్నారు. వెంటనే స్పందించిన మైక్రోసాఫ్ట్ బృందం దాన్ని తొలగించింది.
నోవాక్ జొకోవిచ్ కు ఆన్లైన్ కోర్టులో వింత అనుభవం ఎదురయింది. తన వీసా రద్దుకు వ్యతిరేకంగా ఆయన ఈ రోజు కోర్టు విచారణలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా నోవాక్ జొకోవిచ్ కోర్టు వ్యవహారాల వర్చువల్ సమావేశాన్ని ఒక హ్యకర్ హ్యాక్ చేశాడు. స్ట్రీమింగ్ లింక్‌లో సంగీతం, పోర్న్‌లను ప్రసారం చేశారు. దీంతో జడ్జీలు ఒక్కసారిగా షాక్ తిన్నారు. వెంటనే స్పందించిన మైక్రోసాఫ్ట్ బృందం దాన్ని తొలగించింది. కొత్త లింకును జోడించింది. వీసా రద్దు కేసులో సెర్బియా టెన్నిస్ స్టార్ నోవాక్ జోకోవిచ్‌కు కోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో మెల్‌బోర్న్ ఫెడరల్ సర్క్యూట్ ఫ్యామిలీ కోర్టు జోకోవిచ్‌కు అనుకూలంగా సంచలన తీర్పు వెలువరించింది. జోకోవిచ్ వీసాను రద్దు చేస్తూ ఆస్ట్రేలియా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కోర్టు రద్దు చేసింది. అంతేకాకుండా అకారణంగా జోకోవిచ్ వీసాను రద్దు చేశారని పేర్కొంది. జడ్జి ఆంథోనీ కెల్లీ జోకోవిచ్‌ను విడుదల చేయవలసిందిగా ఆదేశించారు.
అలాగే అతని పాస్‌పోర్ట్, ఇతర ప్రయాణ పత్రాలను అతనికి తిరిగి ఇవ్వాలని అధికారులకు సూచించారు. దీంతో జోకోవిచ్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఆడడానికి లైన్ కూడా క్లియరైంది. దీంతో ప్రస్తుతం డిటెన్షన్ సెంటర్‌లో ఉన్న జోకోవిచ్ విడుదల కానున్నాడు. అంతే కాకుండా యూఎస్ ఓపెన్‌లో జోకోవిచ్ పాల్గొనడంపై ఉన్న అనుమానాలు కూడా తొలగిపోయాయి.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)