Women's Asian Champions Trophy 2024: ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీ హాకీ విజేతగా భారత్, చైనాను 1-0తో చిత్తు చేసి ఛాంపియన్‌గా నిలిచిన ఇండియా అమ్మాయిలు

India women's national hockey team players celebrate a goal (Photo credit: X @TheHockeyIndia)

ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీ (Womens Asian Champions Trophy 2024)లో భారత మహిళల హాకీ జట్టు ప్రారంభం నుంచి అదరగొట్టింది. ఓటమి అనేది లేకుండా టైటిల్‌ను కైవసం చేసుకుంది. బుధవారం ఫైనల్‌లో 1-0తో చైనాను చిత్తు చేసి ఛాంపియన్‌గా నిలిచింది. దీపిక 31వ నిమిషంలో గోల్‌ చేసి భారత్‌ను ఆధిక్యంలో నిలిపింది. చైనా గోల్ చేసేందుకు చేసిన ప్రయత్నాలను ఇండియా అడ్డుకుంది. భారత్‌ ఈ టైటిల్‌ను దక్కించుకోవడం ఇది మూడోసారి. ఇంతకుముందు దక్షిణ కొరియా కూడా మూడుసార్లు ట్రోఫీని దక్కించుకుంది.

India Win Women's Asian Champions Trophy 2024;

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement