Godavari River: గోదావరిలో ఐదుగురు యువకులు గల్లంతు..తూర్పుగోదావరి జిల్లాలో ఘటన, శివరాత్రి రోజే విషాదం, వీడియో ఇదిగో

గోదావరి నదిలో ఐదుగురు యువకులు గల్లంతు అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం తాడిపూడిలో విషాదం చోటుచేసుకుంది.

Five Youngsters Missing in Godavari River(video grab)

గోదావరి నదిలో (Godavari River)ఐదుగురు యువకులు గల్లంతు అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం తాడిపూడిలో విషాదం చోటుచేసుకుంది. మహాశివరాత్రి సందర్భంగా గోదావరిలో స్నానానికి దిగిన ఐదుగురు యువకులు గల్లంతయ్యారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆరా తీశారు(Five Youngsters Missing). ఈతగాళ్ల సాయంతో యువకుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. బంధువుల రోధనలతో స్థానికంగా విషాదం నెలకొంది.

పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం.. రైస్ మిల్ లోకి చొరబడ్డ ఏనుగుల గుంపు (వీడియో)

ఇక మరో ఘటనలో ఏపీలోని పలు జిల్లాల్లో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టిస్తున్నాయి. పార్వతీపురం మన్యం జిల్లాలో ఓ ఏనుగుల గుంపు జియ్యమ్మవలస మండలం పెదమేరంగిలోని సాయి గాయత్రి మోడరన్ రైస్ మిల్ లోకి చొరబడింది. మిల్లులో భద్రపరిచిన ధాన్యం, బియ్యం నిల్వలను చెల్లాచెదురు చేశాయి. ఏనుగుల దాడిలో సుమారు రూ.2 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్టు సమాచారం.

Five Youngsters Missing in Godavari River

 

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement