Vijaysai Reddy: వైసీపీతో బంధాన్ని అధికారికంగా పూర్తిగా తెంచుకున్నట్లు ప్రకటించిన విజయసాయి రెడ్డి, వైసీపీ సభ్యత్వానికి, పార్టీ పదవులకు రాజీనామా చేసి జగన్‌కు పంపించానని వెల్లడి
వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి, పార్టీ పదవులకు ఈ రోజు నా రాజీనామాను పార్టీ అధ్యక్షుడు జగన్ గారికి పంపించాను అంటూ ట్వీట్ చేశారు. 2029 ఎన్నికల్లో జగన్ గారు భారీ మెజారిటీతో మరోసారి సీఎం కావాలని నిండు మనసుతో కోరుకుంటున్నానని తెలిపారు.
ఇటీవల రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు విజయసాయి రెడ్డి ప్రకటించిన సంగతి విదితమే. రాజ్యసభ సభ్యత్వానికి కూడా ఆయన రాజీనామా చేశారు.ఈ నేపథ్యంలో తన రాజీనామా లేఖను వైసీపీ అధినేత జగన్ కు ఇవాళ పంపించారు. జగన్ ఇవాళ లండన్ నుంచి బెంగళూరు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో, విజయసాయిరెడ్డి సోషల్ మీడియాలో స్పందించారు.
రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన విజయసాయి రెడ్డి.. రాజ్యసభ ఛైర్మన్‌ను కలిసి రాజీనామా లేఖ అందజేత
వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి, పార్టీ పదవులకు ఈ రోజు నా రాజీనామాను పార్టీ అధ్యక్షుడు జగన్ గారికి పంపించాను అంటూ ట్వీట్ చేశారు. 2029 ఎన్నికల్లో జగన్ గారు భారీ మెజారిటీతో మరోసారి సీఎం కావాలని నిండు మనసుతో కోరుకుంటున్నానని తెలిపారు. "నా రాజకీయ ప్రస్థానంలో అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. శత్రుత్వాలకు, అపార్థాలకు అవకాశం ఇవ్వని విధంగా జీవించాలని వ్యవసాయ ప్రపంచంలో మరో ప్రస్థానాన్ని ప్రారంభించాను" అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.
విజయసాయిరెడ్డి స్టేట్ మెంట్
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, పార్టీ పదవులకు ఈ రోజు నా రాజీనామాను గౌరవ పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారికి పంపించాను.
2029 ఎన్నికల్లో శ్రీ వైయస్ జగన్ గారు భారీ మెజారిటీతో మరోసారి ముఖ్యమంత్రి కావాలని నిండు మనసుతో కోరుకుంటున్నాను.
నా రాజకీయ…
— Vijayasai Reddy V (@VSReddy_MP) January 31, 2025
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jan 31, 2025 07:51 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

