Avinash Reddy's Mother Health Update: ఆందోళనకరంగా వైఎస్‌ అవినాష్‌రెడ్డి తల్లి ఆరోగ్య పరిస్థితి, హెల్త్‌బులిటెన్‌ విడుదల చేసిన విశ్వభారతి వైద్యులు

సోమవారం ఉదయం హెల్త్‌బులిటెన్‌ విడుదల చేసిన వైద్యులు.. అందులో ఆమె ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వెల్లడించారు.

MP Avinash Reddy (Photo-Video Grab)

లక్ష్మమ్మ ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని విశ్వభారతి వైద్యులు ప్రకటించారు. సోమవారం ఉదయం హెల్త్‌బులిటెన్‌ విడుదల చేసిన వైద్యులు.. అందులో ఆమె ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వెల్లడించారు. లక్ష్మమ్మ కార్డియో సమస్యతో బాధపడుతున్నారు. బీపీ తక్కువగా ఉండి.. ఏం తినలేకపోతున్నారు. వాంతులు అవుతున్నాయి.

మెదడుకు, పొట్టకు అల్ట్రాసౌండ్‌ చేయాల్సి ఉంది. ఆమె ఇంకా వైద్య బృందం పర్యవేక్షణలో ఉంది. ఇంకా కొన్నిరోజులు ఆస్పత్రిలోనే ఉండాలి. లోబీపీ కారణంగా ఐసీయూలోనే ఉంచి చికిత్స అందించాలి అని వైద్యులు ప్రకటించారు. వివేకా కేసులో విచారణకు ఎంపీ అవినాష్‌రెడ్డి సీబీఐ ఎదుట హాజరు కావాల్సి ఉంది. అయితే తల్లి అనారోగ్యం కారణంగానే హాజరుకాలేనని సీబీఐకి అవినాష్‌రెడ్డి సమాచారం అందించారు.

Avinash Reddy's Mother Health Update

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)