Electric Car Fire Video: వీడియో ఇదిగో, ఎన్టీఆర్ స్టేడియం సమీపంలో ఎలక్ట్రిక్ కారులో అకస్మాత్తుగా మంటలు, అగ్నిప్రమాదంలో పూర్తిగా కాలి బూడిదైన కారు

హైదరాబాద్ లోని నారాయణగూడ పరిధిలోని ఎన్టీఆర్ స్టేడియం సమీపంలో ఆదివారం మధ్యాహ్నం ఓ ఎలక్ట్రిక్ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి కలకలం సృష్టించాయి. ఈ అగ్నిప్రమాదంలో కారు పూర్తిగా కాలి బూడిదైంది. మంటల తీవ్రతకు సమీపంలో పార్క్ చేసి ఉన్న మరో కారు కూడా పాక్షికంగా దెబ్బతింది.

Electric Car Fire Video:

హైదరాబాద్ లోని నారాయణగూడ పరిధిలోని ఎన్టీఆర్ స్టేడియం సమీపంలో ఆదివారం మధ్యాహ్నం ఓ ఎలక్ట్రిక్ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి కలకలం సృష్టించాయి. ఈ అగ్నిప్రమాదంలో కారు పూర్తిగా కాలి బూడిదైంది. మంటల తీవ్రతకు సమీపంలో పార్క్ చేసి ఉన్న మరో కారు కూడా పాక్షికంగా దెబ్బతింది.  స్థానికులు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది, సుమారు అరగంట పాటు శ్రమించి మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చారు.

ప్రమాద సమయంలో వాహనంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదని, సాంకేతిక లోపం ఏమైనా ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని ఓ సీనియర్ పోలీసు అధికారి వెల్లడించారు. ఫోరెన్సిక్ బృందం ఆధారాలు సేకరించిన తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయని ఆయన పేర్కొన్నారు.

Electric Car Fire Video:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement