Hyderabad Shocker: వీడియో ఇదిగో, నార్సింగి అనంత పద్మనాభ స్వామి దేవాలయం గుట్టపై పై జంట హత్యలు, కత్తితో పొడిచి అనంతరం బండ రాళ్లతో మోది దారుణంగా..
రంగారెడ్డి జిల్లా నార్సింగి మండలం పుప్పాలగూడలో మంగళవారం జరిగిన జంట హత్యల ఘటన కలకలం రేపింది. అనంత పద్మనాభ స్వామి ఆలయ కొండపై ఇద్దరు వ్యక్తులు దారుణ హత్యకు గురైనట్లు స్థానికులు గుర్తించారు.
రంగారెడ్డి జిల్లా నార్సింగి మండలం పుప్పాలగూడలో మంగళవారం జరిగిన జంట హత్యల ఘటన కలకలం రేపింది. అనంత పద్మనాభ స్వామి ఆలయ కొండపై ఇద్దరు వ్యక్తులు దారుణ హత్యకు గురైనట్లు స్థానికులు గుర్తించారు.సంక్రాంతి పండుగ సందర్భంగా గాలిపటాలు ఎగురవేసేందుకు కొండపైకి వెళ్లిన స్థానిక యువకులు మృతదేహాలను గుర్తించి 100కు డయల్ చేసి పోలీసులకు సమాచారం అందించారు.
గుర్తుతెలియని దుండగలు మహిళపై అత్యాచారం చేసి అనంతరం హత్య చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మహిళతో ఉన్న వ్యక్తిని అతి దారుణంగా హత్య చేసినట్లు గుర్తించారు. అతని తలను బండరాయితో మోది హత్య చేసి అనంతరం మృతదేహాన్ని తగలబెట్టారని తెలిపారు. ఘటనాస్థలిలో కొన్ని ఆధారాలు సేకరించామని, వాటి ద్వారా మృతుల వివరాలు గుర్తిస్తామని పోలీసులు చెబుతున్నారు.
అనంత పద్మనాభ స్వామి దేవాలయం గుట్టపై పై జంట హత్యలు
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)