Hyderabad Rains: హైదరాబాద్‌లో భారీ వర్షాలు, నిర్మాణంలో ఉన్న అపార్ట్‌మెంట్ గోడ కూలి ఏడుగురు మృతి, వీడియో ఇదిగో..
బాచుపల్లి రేణుక ఎల్లమ్మ కాలనీలో రాత్రి కురిసిన వర్షానికి నిర్మాణంలో ఉన్న అపార్ట్‌మెంట్‌లోని గోడ కూలి నాలుగేళ్ల బాలుడితో సహా ఏడుగురు మృతి. మరో ఆరుగురికి తీవ్రగాయాలు. గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలింపు.. మృతులు ఒడిస్సా, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తింపు.
హైదరాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది. గోడకూలి ఏడుగురు మృతిచెందారు. మంగళవారం సాయంత్రం బాచుపల్లిలోని రేణుక ఎల్లమ్మ కాలనీలో వర్షానికి గోడ కూలింది. రాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద ఏడు మృతదేహాలను గుర్తించి వెలికితీశారు.
బాచుపల్లిలో గోడకూలిన ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. దీనికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం హామీ ఇచ్చారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.
Here's Video
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..
Astrology: మార్చ్ 12వ తేదీన సూర్యుడు కుజుడి కలయిక వల్ల నవ పంచమ యోగం ఈ మూడు రాశుల వారు కుబేరులు అవుతారు
Astrology: మార్చ్ 15వ తేదీన బుధ గ్రహం తిరోగమనం ఈ మూడు రాశుల వారు కి అఖండ ధన ప్రాప్తియోగం
Advertisement
Advertisement
Advertisement