Hyderabad Horror: హైదరాబాద్ నగరంలో పట్టపగలే దారుణం, బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని వేట కొడవలి, రాడ్డుతో నరికి చంపిన ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు
అంబర్‌పేట్‌కు చెందిన జంగం సాయినాథ్ బైక్‌పై కోఠి ఇసామియా బజార్ నుంచి ద్విచక్ర వాహనంపై బయలుదేరి పురానాపూల్ జాతీయ రహదారిలో కార్వాన్ వైపు వెళ్తుండగా ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు అడ్డగించి రాడ్డుతో దాడి చేశారు. కింద పడవేసి వేట కొడవలితో నరికి చంపారు.
హైదరాబాద్ నగరంలోని పురానాపూల్ జాతీయ రహదారిపై పట్టపగలే ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు ఒకరిని వేట కొడవలి, రాడ్డుతో నరికి చంపారు.అంబర్‌పేట్‌కు చెందిన జంగం సాయినాథ్ బైక్‌పై కోఠి ఇసామియా బజార్ నుంచి ద్విచక్ర వాహనంపై బయలుదేరి పురానాపూల్ జాతీయ రహదారిలో కార్వాన్ వైపు వెళ్తుండగా ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు అడ్డగించి రాడ్డుతో దాడి చేశారు. కింద పడవేసి వేట కొడవలితో నరికి చంపారు. పెట్రోలింగ్ విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ జనార్దన్ నిందితులను పట్టుకోవడానికి వెళ్లగా వారు మూసీనదిలో దూకి పారిపోయారు.
దాడిలో తీవ్రంగా గాయపడ్డ సాయినాథ్ అప్పటికే మృతి చెందాడు. ఈ దారుణాన్ని అక్కడే కొంతమంది ప్రయాణికులు చూస్తూ ఉండిపోయారే తప్ప ఎవరూ అడ్డుకోలేకపోయారు. ఈ ఘటనను సెల్‌ఫోన్లలో చిత్రీకరించారు.సాయినాథ్ హత్యకు గల కారణాలు తెలియరాలేదని, కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.
Here's Disturbed Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)