New Year 2024: వీడియో ఇదిగో, అర్థరాత్రి రెచ్చిపోయిన మందుబాబులు, పాతబస్తీలో పోలీసుల చెంపను పగలగొడుతూ హల్‌చల్
న్యూ ఇయర్ సందర్భంగా హైదరాబాద్ కమిషనరేట్ల పరిధిలో భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. డిసెంబర్ 31 సందర్భంగా మందుబాబులను పోలీసులు హెచ్చరించినా వారు పట్టించుకోలేదు. దీంతో, వేల సంఖ్యలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు.
న్యూ ఇయర్ సందర్భంగా హైదరాబాద్ కమిషనరేట్ల పరిధిలో భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. డిసెంబర్ 31 సందర్భంగా మందుబాబులను పోలీసులు హెచ్చరించినా వారు పట్టించుకోలేదు. దీంతో, వేల సంఖ్యలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు. న్యూ ఇయర్ సందర్భంగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 1200 కేసులు, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 1241 కేసులు నమోదు అయినట్టు పోలీసులు తెలిపారు. ఇక, సైబరాబాద్‌లో బ్రీత్ అనలైజర్ కౌంట్ 200 పాయింట్లు దాటిన వారు 151 మంది ఉన్నట్టు వెల్లడించారు. ఇక పాత బస్తీలో మందుబాబులు రెచ్చిపోయారు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ కోసం ఆపిన పోలీసుల చెంపను మహేంద్ర సింగ్ అనే వ్యక్తి పగలకొట్టాడు. వీడియో ఇదిగో..
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)