Siddipet, Oct 3: సిద్దిపేటలో (Siddipet) రైలు కూత వినిపించనున్నది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రైలు (Train) నేడు సిద్దిపేటకు రానున్నది. సీఎం కేసీఆర్‌ (CM KCR) దశాబ్దాల కల సాకారం కానున్నది. మంగళవారం మధ్నాహ్నం 3 గంటలకు సిద్దిపేట రైల్వేస్టేషన్‌ లో మంత్రి హరీశ్‌రావు రైలును ప్రారంభించనున్నారు. మనోహరాబాద్‌ నుంచి కొత్తపల్లి వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపడుతున్న రైల్వేలైన్‌ పనులు స్వరాష్ట్రంలో వేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే గజ్వేల్‌ వరకు పనులు పూర్తయి రైలు సేవలు ప్రారంభమయ్యాయి. ఇటీవల సిద్దిపేట వరకు రైల్వేలైన్‌ నిర్మాణం పూర్తయింది. దాంతో మంగళవారం నుంచి సిద్దిపేట-కాచిగూడకు రైలు సేవలు ప్రారంభం కానున్నాయి. కాగా, మనోహరాబాద్‌-సిద్దిపేట రైల్వేస్టేషన్ల మధ్య నూతన రైలు మార్గాన్ని మంగళవారం ప్రధాని మోదీ వర్చువల్‌గా జాతికి అంకితం చేస్తారని రైల్వే అధికారులు తెలిపారు.

Oldest Skydiver: 104 ఏళ్ల వయసులో 4100 మీటర్ల ఎత్తులో ఉన్న విమానం నుంచి కిందకు దూకిన బామ్మ.. గిన్నిస్ రికార్డు నెలకొల్పడమే తన లక్ష్యమని వెల్లడి

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)