Newdelhi, Oct 3: ఇదో సాహసోపేతమైన ఘటన. గిన్నిస్ ప్రపంచరికార్డు (Guiness World Record) నెలకొల్పడమే లక్ష్యంగా పెట్టుకున్న అమెరికా (America) వృద్ధురాలు డొరొతీ హాఫ్‌ మన్ 104 ఏళ్ల వయసులో స్కైడైవింగ్ చేశారు. నిపుణుడైన మరో స్కైడైవర్‌ తో కలిసి ఆమె విమానం 4,100 మీటర్ల ఎత్తున ఉండగా టాండమ్ జంప్‌ చేశారు. చికాగోలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. దిగ్విజయంగా స్కైడైవ్ పూర్తి చేసిన అనంతరం డొరొతీ చిరునవ్వులు చిందిస్తూ అక్కడున్న వారికి అభివాదం చేశారు. స్కైడైవింగ్ చేసిన అత్యంత పెద్దవయసు వ్యక్తిగా ఈ ఫీట్‌ తో తనకు రికార్డు దక్కుతుందని డొరొతీ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ రికార్డు స్వీడెన్‌కు చెందిన లినేయా లార్సన్ పేరిట ఉంది. 2022 మేలో ఆమె 103 వయసులో స్కైడైవింగ్ దిగ్విజయంగా పూర్తి చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పారు.

Australia Parrot: రూ.1.30 లక్షల విలువైన ఆస్ట్రేలియా చిలుక కనిపించడం లేదని జూబ్లీహిల్స్ వ్యాపారి ఫిర్యాదు.. ఒక్క రోజులో వెతికితెచ్చిన పోలీసులు.. ఎలా కనిపెట్టారంటే??

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)