Corona in TS: తెలంగాణలో కొత్తగా 162 మందికి కరోనా, జీహెచ్ఎంసీ పరిధిలో 55 కొత్త కేసులు

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 33,506 కరోనా పరీక్షలు నిర్వహించగా, 162 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో 55 కొత్త కేసులు నమోదు కాగా, నల్గొండ జిల్లాలో 11, రంగారెడ్డి జిల్లాలో 11, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 10, కరీంనగర్ జిల్లాలో 10 కేసులు వెల్లడయ్యాయి.

coronavirus Test Representational Image. (File Photo | PTI)

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 33,506 కరోనా పరీక్షలు నిర్వహించగా, 162 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో 55 కొత్త కేసులు నమోదు కాగా, నల్గొండ జిల్లాలో 11, రంగారెడ్డి జిల్లాలో 11, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 10, కరీంనగర్ జిల్లాలో 10 కేసులు వెల్లడయ్యాయి. జనగాం, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, కొమరంభీం ఆసిఫాబాద్, ములుగు, నాగర్ కర్నూల్, నారాయణపేట, నిర్మల్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 214 మంది ఆరోగ్యవంతులు కాగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 6,67,887 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,59,722 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 4,235 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,930కి పెరిగింది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement