Kid Stuck in Bowl: ఇత్తడి గిన్నెలో ఇరుక్కుపోయిన బాలుడి తల, వెల్డింగ్ షాపుకు బాలుడ్ని తీసుకుని పరిగెత్తిన తల్లిదండ్రులు, సోషల్ మీడియాలో వీడియో వైరల్
దీంతో తల కింది భాగమంతా అందులోనే ఉండిపోయింది. బయటకు తీయడానికి ఎంత ప్రయత్నించినా ఉపయోగం లేకపోవడంతో వెల్డింగ్ షాపుకు తీసుకెళ్లారు. చివరకు గిన్నెను కట్ చేసి బాలుడిని బయటకు తీశారు. దీంతో ఆ బాలుడి తల్లిదండ్రులు ఉపిరి పీల్చుకున్నారు.
తెలంగాణలో ఆడుకుంటూ ఓ పిల్లాడు వెడల్పాటి ఇత్తడి గిన్నెలో ఇరుక్కుపోయాడు. దీంతో తల కింది భాగమంతా అందులోనే ఉండిపోయింది. బయటకు తీయడానికి ఎంత ప్రయత్నించినా ఉపయోగం లేకపోవడంతో వెల్డింగ్ షాపుకు తీసుకెళ్లారు. చివరకు గిన్నెను కట్ చేసి బాలుడిని బయటకు తీశారు. దీంతో ఆ బాలుడి తల్లిదండ్రులు ఉపిరి పీల్చుకున్నారు. తర్వాత బాలుడిని ఆసుపత్రికి తీసుకెళ్లగా.. పరీక్షించిన వైద్యులు బాలుడికి ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పారు. వరంగల్ జిల్లాలోని పర్వతగిరి మండలం మూడెత్తుల తండాలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)