Hyderabad, Jan 17: సంక్రాంతి పర్వదినం సందర్భంగా హైదరాబాద్ లో దొంగలు రెచ్చిపోతున్నారు. సామాన్యులే కాకుండా ప్రముఖులు, ప్రజా ప్రతినిధుల ఇండ్లకు కూడా కన్నం వేస్తున్నారు. బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య (Ponnala Lakshmaiah) ఇంట్లో భారీ దొంగతనం (Robbery) జరిగింది. హైదరాబాద్ ఫిలింనగర్ లోని పొన్నాల ఇంట్లో రూ.1.5 లక్షల నగదుతోపాటు భారీగా బంగారు అభరణాలను దుండగులు చోరీ చేశారు. దీంతో ఆయన సతీమణి అరుణా దేవి ఫిలింనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలింపు మొదలుపెట్టారు.
మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఇంట్లో చోరీ..
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన
లక్షన్నర నగదుతో పాటు భారీగా అభరణాలు దోచుకెళ్లిన దొంగలు
ఫిలిం నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన పొన్నాల లక్ష్మయ్య సతీమణి అరుణాదేవి
కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్న పోలీసులు pic.twitter.com/isImZnV6GD
— BIG TV Breaking News (@bigtvtelugu) January 17, 2025
గతంలో వీళ్ల ఇండ్లల్లోనూ..
పొన్నాల లక్ష్మయ్య ఇంట్లోనే కాదు.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, బీఆర్‌ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీన్ కుమార్ ఇండ్లల్లోనూ ఇటీవల దొంగలు పడ్డారు. గతేడాది నవంబర్ లో మంత్రి శ్రీధర్ బాబు ఇంట్లో దొంగలు పడ్డారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని మినిస్టర్స్ క్వార్టర్స్ లో మంత్రి శ్రీధర్ బాబు ఇంట్లో సెల్ ఫోన్ చోరీకి గురైనట్లు పోలీసులు గుర్తించారు. అంతకు ముందు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నివాసంలో రూ.80 వేలు విలువ చేసే వెండి వస్తువులు మాయమైనట్లు గుర్తించారు. ఇక కాగజ్ నగర్ మండలం కోసిని గ్రామంలోని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇంట్లో చోరీ జరిగింది. బీరువా తాళాలు పగులగొట్టి విలువైన పత్రాలు ఎత్తుకెళ్లారు.