
Delhi, January 16: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ మరో రెండు హామీలను ప్రకటించింది. సీఎం రేవంత్ రెడ్డి, ఢిల్లీ పీసీసీ అధ్యక్షుడు దేవేంద్ర యాదవ్, కాంగ్రెస్ నేతలు తదితరులు...ఢిల్లీలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు.
ఢిల్లీ ప్రభుత్వాన్ని నడపడానికి తెలంగాణ నుండి మద్దతు ఇస్తాం అని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెస్తే తెలంగాణ నుండి ఏ సహాయం కావాలన్నా చేస్తాం అన్నారు. మోడీ, కేజ్రీవాల్ ఇద్దరు ఒక్కటే.. పేర్లు మాత్రమే వేరు, ఇద్దరు అబద్ధాలు ఆడుతారు..కాలుష్యంతో తెలంగాణ ప్రజలు ఢిల్లీకి రావాలంటే భయపడుతున్నారు అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ కు మావోయిస్టుల బెదిరింపు లేఖ కేసులో ముగ్గురు అరెస్ట్, నిందితుల నుంచి 3 సెల్ ఫోన్లు, ఓ మోటార్ సైకిల్ స్వాధీనం
కాంగ్రెస్ హామీ ఇచ్చిందంటే వందకు వంద శాతం అమలు చేస్తుందిన్నారు రేవంత్. తెలంగాణలో ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేశాం...దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రైతులకు ఏకకాలంలో రూ.2 లక్షల రుణాలను మాఫీ చేశాం అన్నారు. గతంలో ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్న షీలా దీక్షిత్ వల్లే ఢిల్లీ అభివృద్ధి సాధ్యమైంది...తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి సోనియా ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు అన్నారు. ఎన్నికల వేళ ఢిల్లీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలకు కాంగ్రెస్ కట్టుబడి ఉంటుందన్నారు రేవంత్.
Telangana CM Revanth Reddy on Delhi Assembly Elections
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ హామీలు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ తరపున రెండు గ్యారెంటీలను ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి, ఢిల్లీ పీసీసీ అధ్యక్షుడు దేవేంద్ర యాదవ్, కాంగ్రెస్ నేతలు
ఢిల్లీలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 500 రూపాయలకే… pic.twitter.com/InS2b6CDaP
— Telugu Scribe (@TeluguScribe) January 16, 2025
ఇక ఇవాళ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఢిల్లీ నుంచి రాత్రి 10 గంటలకు సింగపూర్ వెళ్లనున్న రేవంత్...3 రోజులు సింగపూర్ లో పర్యటించనున్నారు. తెలంగాణలో పెట్టుబడులకు సంబంధించి వివిధ కంపెనీల ప్రతినిధులతో సంప్రదింపులు జరపనున్నారు. సింగపూర్ పర్యటన అనంతరం ఈ నెల 20న దావోస్ కు పయనం అవుతారు రేవంత్. 20 నుంచి 22 వరకు దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వార్షిక సదస్సులో పాల్గొంటారు.