CM Revanth Reddy Singapore tour updates(CMO)

Delhi, January 17:  సీఎం రేవంత్ రెడ్డి సింగపూర్ పర్యటన కొనసాగుతోంది. తన పర్యటనలో భాగంగా ఇవాళ సింగపూర్ ప్రభుత్వ విదేశీ వ్యవహారాల మంత్రి, భారత సంస్కృతిపై ప్రత్యేక అభిరుచి కలిగిన వివియాన్ బాలతో చర్చలు జరిపారు సీఎం రేవంత్ రెడ్డి.

చర్చలు ఫలప్రదంగా జరిగాయని తెలంగాణ సీఎంవో వెల్లడించింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి శ్రీధర్ బాబు ... సింగపూర్ మంత్రితో జరిపిన చర్చల వివరాలతో పాటు ఫోటోలను ఎక్స్ ద్వారా వెల్లడించింది తెలంగాణ సీఎంవో.   ఢిల్లీ ప్రభుత్వాన్ని నడిపేందుకు తెలంగాణ నుండి మద్దతిస్తాం...మరో రెండు హామీలను ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్‌తోనే ఢిల్లీ అభివృద్ధి సాధ్యమని వెల్లడి

గ్రీన్ ఎనర్జీ, నీటి నిర్వహణ, నదుల పునరుజ్జీవనం, టూరిజం, విద్య మరియు నైపుణ్యాభివృద్ధి, ఐటీ పార్కులు మరియు ఇతర రంగాలలో దీర్ఘకాలిక భాగస్వామ్యాలపై ఈ భేటీలో చర్చించినట్లు తెలిపింది తెలంగాణ సీఎంవో. ఈ పర్యటన విజయవంతమవుతుందని భావిస్తున్నట్లు వెల్లడించింది.

CM Revanth Reddy Singapore tour updates

3 రోజులు సింగపూర్ లో పర్యటించనుంది సీఎం రేవంత్ రెడ్డి బృందం. తెలంగాణలో పెట్టుబడులకు సంబంధించి వివిధ కంపెనీల ప్రతినిధులతో సంప్రదింపులు జరపనున్నారు. సింగపూర్ పర్యటన అనంతరం ఈ నెల 20న దావోస్ కు పయనం అవుతారు రేవంత్. 20 నుంచి 22 వరకు దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వార్షిక సదస్సులో పాల్గొంటారు.