Nizamabad Road Mishap: నిజామాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఆటోని ఢీకొట్టిన డీసీఎం, ముగ్గురు అక్కడికక్కడే మృతి, మరో నలుగురికి తీవ్రగాయాలు

Road Accident (Representational Image)

నిజామాబాద్ నగర శివారులోని అర్సపల్లి బైపాస్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నిజామాబాద్ నుంచి రెంజల్ మండలం దూపల్లి వెళ్తున్న ఆటోను ఎదురుగా వచ్చిన డీసీఎం ఢీకొన్నాయి. ఈ సంఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉండగా మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.సంఘటన జరిగిన ప్రాంతంలో అతివేగంతో రెండు వాహనాలు ఢీకొట్టు కోగా, మృతదేహాలతో పరిస్థితి భయానకంగా మారింది. గాయపడిన వారిని జిల్లా ఆసుపత్రికి తరలించారు.నిజామాబాద్‌లో భవన నిర్మాణ పనులు చేసి ఇంటికి తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించినట్లు తెలిసింది.

Here's Update

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)