ఏపీలోని రెండు జిల్లాలు కృష్ణా జిల్లా, మచిలీపట్నంలో దొంగ నోట్లు కలకలం రేగింది. నగరంలోని ఓ వైన్ షాప్‌లో ఓ వ్యక్తి మద్యం కొనుగోలు చేసి దొంగ నోట్లు ఇచ్చాడు. షాపు యజమాని గమనించి చిలకలపూడి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సమీపంలో ఉన్న సీసీ పుటేజ్‌లను పరిశీలిస్తున్నారు.

ఏపీలో రోడ్ల దుస్థితికి అద్దం పట్టే వీడియోలు ఇవిగో, రోడ్లు సరిగా లేకపోవడంతో డోలీలో నిండు గర్భిణిని, అనారోగ్యంతో ఉన్న వృద్ధుడిని ఆస్పత్రికి తరలించిన కుటుంబ సభ్యులు

ఇక ఏలూరు జిల్లా, ద్వారకాతిరుమలలో నకిలీ కరెన్సీ కలకలం రేగింది. టాయ్ క్యాష్‌తో దుండగులు మోసానికి యత్నించారు. రూ. 2.50 లక్షలకు రూ. 15 లక్షలు నకిలీ కరెన్సీ ఇచ్చేటట్లుగా ఒప్పందం కుదుర్చుకుని, డబ్బు చేతులు మారుతున్న సమయంలో నకిలీ కరెన్సీకి బదులు టాయ్ క్యాష్ ఇస్తున్నట్లుగా ఓ బాధితుడు గుర్తించాడు. పారిపోవడానికి యత్నించిన దుండగులలో స్థానికులు ఒకరిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు.

Fake Currency Notes Caught in Two Districts in Andhra

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)