Dalai Lama Apologises To Boy: నాలుకను చప్పరించమన్న బాలుడికి సారీ చెప్పిన దలైలామా, బౌద్ధ‌ మ‌త‌గురువును అరెస్ట్‌ చేయాలని కొంద‌రు డిమాండ్‌..

బౌద్ధ‌ మ‌త‌గురువు దలైలామా(Dalai Lama) చిన్న పిల్లాడు ముద్దుకి సంబంధించి వివాదంలో ఇరుక్కున్న విష‌యం తెలిసిందే. నాలుక‌ను చ‌ప్ప‌రించాల‌ని ఓ బాలుడిని కోరిన ద‌లైలామా వీడియో తాజాగా ఆన్‌లైన్‌లో వైర‌ల్ అవుతోంది. ఆ ఘ‌ట‌న ప‌ట్ల ఆ బాలుడికి, అత‌ని కుటుంబానికి ద‌లైలామా క్ష‌మాప‌ణ‌లు చెప్పారు

Dalai Lama Apologises To Boy (Photo-Video Grab)

బౌద్ధ‌ మ‌త‌గురువు దలైలామా(Dalai Lama) చిన్న పిల్లాడు ముద్దుకి సంబంధించి వివాదంలో ఇరుక్కున్న విష‌యం తెలిసిందే. నాలుక‌ను చ‌ప్ప‌రించాల‌ని ఓ బాలుడిని కోరిన ద‌లైలామా వీడియో తాజాగా ఆన్‌లైన్‌లో వైర‌ల్ అవుతోంది. ఆ ఘ‌ట‌న ప‌ట్ల ఆ బాలుడికి, అత‌ని కుటుంబానికి ద‌లైలామా క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. అప్పుడ‌ప్పుడు ద‌లైలామా త‌నను క‌లిసిన వారిని టీజ్ చేస్తార‌ని , చాలా స‌ర‌దాగా వారితో గ‌డుపుతుంటార‌ని ఆ గురువుకు చెందిన అధికార బృందం ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.

కాగా బాలుడి పెదవులపై దలైలామా ముద్దు పెట్టి తన నాలుకను బయటకు చాపి చప్పరిస్తావా అని ఆ బాలుడితో అన్న విషయం విదితమే. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. దీంతో పలువురు నెటిజన్లు ఆయన చర్యను విమర్శించారు. దలైలామా ఎందుకు అలా చేశారని కొందరు ప్రశ్నించారు. మైనర్‌ బాలుడి పట్ల ఆయన చర్యను ఎవరూ సమర్థించబోరన్నారు. అసహ్యకరమైన ఈ చర్యపై దలైలామాను అరెస్ట్‌ చేయాలని కొంద‌రు డిమాండ్‌ చేశారు.

Here's Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement