Italy Govt Wants to Ban English: ఇంగ్లీష్ బ్యాన్ చేస్తూ కొత్త చట్టాన్ని తీసుకువచ్చిన ఇటలీ, దీని ప్రకారం ఎవరైనా ఇంగ్లీష్ మాట్లాడితే రూ. 82 లక్షల వరకు జరిమానా
విదేశీ పదాలను ఉపయోగిస్తే దాదాపు రూ. 82 లక్షల వరకు జరిమానా విధించడం జరుగుతుంది.
ఇటాలీ ప్రధాన మంత్రి, బ్రదర్స్ ఆఫ్ ఇటలీ పార్టీ నేత జార్జియా మెలోని ఆంగ్ల భాషను పూర్తిగా బ్యాన్ చేసే ఈ కొత్త ప్రతిపాదిత చట్టాన్ని తీసుకొచ్చారు.ఆ చట్టం ప్రకారం ఏ ఇటాలియన్ అయినా కమ్యూనికేట్ చేసేటప్పుడూ .. విదేశీ పదాలను ఉపయోగిస్తే దాదాపు రూ. 82 లక్షల వరకు జరిమానా విధించడం జరుగుతుంది. ఈ బిల్లును ఛాంబర్ ఆఫ్ డిప్యూటీ సభ్యుడు ఫాభియో రాంపెల్లి ప్రవేశ పెట్టారు. దీనికి ఇటాలియన్ ప్రధానమంత్రి జార్జియా మద్దతు ఇచ్చారు. ఆంగ్ల పదాలు లేదా ఆంగోమానియాను లక్ష్యంగా చేసకుని మరీ ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ చట్టం ఆమోదం పొందితే ఆంగ్ల భాషను పూర్తిగా బ్యాన్ చేసిన తొలిదేశంగా ఇటలీ నిలుస్తుంది.
Here's Update