Tokyo Olympics 2020: రెండు సార్లు కరోనా..బతకడమే కష్టమన్నారు, ఏకంగా ఒలింపిక్స్‌లో బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు, అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న బ్రిటన్‌ స్విమ్మర్‌ టామ్‌ డియాన్ కథ

ఏడాదిలో రెండుసార్లు కరోనా మహమ్మారి బారీన పడ్డాడు. అయినా అదరలేదు..బెదరలేదు...ఏకంగా టోక్యో ఒలింపిక్స్ లో (Tokyo Olympics 2020) స్వర్ణంతో మెరిసాడు. ఇది బ్రిటన్‌కు చెందిన స్విమ్మర్‌ టామ్‌ డియాన్‌ (British swimmer Tom Dean) కథ.

Tokyo Olympics 2020: రెండు సార్లు కరోనా..బతకడమే కష్టమన్నారు, ఏకంగా ఒలింపిక్స్‌లో బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు, అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న బ్రిటన్‌ స్విమ్మర్‌ టామ్‌ డియాన్ కథ
British swimmer Tom Dean (Photo Credit: AFP)

ఏడాదిలో రెండుసార్లు కరోనా మహమ్మారి బారీన పడ్డాడు. అయినా అదరలేదు..బెదరలేదు...ఏకంగా టోక్యో ఒలింపిక్స్ లో (Tokyo Olympics 2020) స్వర్ణంతో మెరిసాడు. ఇది బ్రిటన్‌కు చెందిన స్విమ్మర్‌ టామ్‌ డియాన్‌ (British swimmer Tom Dean) కథ.. బ్రిటన్‌కు చెందిన స్విమ్మర్‌ టామ్‌ డియాన్‌ గతేడాది సెప్టెంబర్‌లో తొలిసారి అతనికి కోవిడ్‌ సోకింది. మళ్లీ నాలుగు నెలలకే ఈ జనవరిలోనూ వైరస్‌ బారిన పడ్డాడు. అయితే మొదటి దశలో కరోనా అంతగా ప్రభావం చూపలేదు..రెండో సారి అతన్ని కరోనా బాగా ఇబ్బంది పెట్టింది. విపరీతమైన దగ్గు.. ఊపిరితిత్తులపై ప్రభావం చూపడంతో.. గట్టిగా దమ్ము తీసుకోలేని దుస్థితి.

ఒలింపిక్‌ మెడల్‌ గురించి అటుంచితే.. బతకడమే కష్టమన్నట్టుగా బ్రిటన్‌ స్విమ్మర్‌ టామ్‌ డియాన్ పరిస్థితి మారింది. కరోనాతోనే సరిపోతుంది... టోక్యోదాకా ఏం వెళతాడులే! అని కొందరంటే... అతనికి ఈ నేషనల్‌ ట్రయల్సే ఎక్కువని ఇంకొందరు అభిప్రాయపడ్డారు. కానీ టామ్‌ డియాన్‌ అలాంటి అభిప్రాయాలను, అనుమానాలను పటాపంచలు చేశాడు. అంచనాల్ని తారుమారు చేశాడు. మంగళవారం జరిగిన పురుషుల 200 మీటర్ల ఫ్రీస్టయిల్‌ ఈవెంట్‌లో టామ్‌ బంగారు పతకం (Dean beats COVID twice to win gold ) గెలుపొందాడు.

టోక్యోలో కరోనా కల్లోలం, అత్యధికంగా ఒక్కరోజే 2,848 కేసులు నమోదు, ఒలింపిక్స్ గేమ్స్ ప్రారంభమైన తర్వాత జపాన్ రాజధానిలో పంజా విప్పిన కోవిడ్, ఆందోళనకరంగా మారిన డెల్టా వేరియంట్

ఐసోలేషన్‌లో ఉండడంతో చాలా రోజులు నీటిలోకి దిగలేక పోయాడు. దీంతో మళ్లీ గాడిలో పడడానికి ఎంతో సమయం పట్టిందని డియాన్ తెలిపాడు. టామ్‌ అందరికంటే ముందుగా 1ని:44.22 సెకన్లలో ముగించాడు. అతని సహచరుడు డన్‌కన్‌ స్కాట్‌ (1ని:44.26 సెకన్లు) రజతం, బ్రెజిల్‌ స్విమ్మర్‌ ఫెర్నాండో (1ని:44.66 సెకన్లు) కాంస్యం గెలిచాడు. వందేళ్లలో బ్రిటన్‌ స్విమ్మర్లు ఒకే ఈవెంట్‌లో తొలి రెండు స్థానాల్లో నిలవడం కూడా ఇదే మొదటిసారి. 1908 లండన్‌ ఒలింపిక్స్‌లో బ్రిటన్‌ స్విమ్మర్లు స్వర్ణ, రజత పతకాలు గెలిచారు. ఆ తర్వాత తాజాగా టోక్యోలోనే దీన్ని పునరావృతం చేశారు.

(The above story first appeared on LatestLY on Jul 28, 2021 03:51 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).